వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా, ఆందోళనలో మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఏపీ శాసనసభ్యుల్లో ఇదే తొలి కేసు

తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,

వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా, ఆందోళనలో మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఏపీ శాసనసభ్యుల్లో ఇదే తొలి కేసు

తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,

తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు కరోనాబారిన పడ్డారు. తాజాగా ఏపీలోనూ ప్రజాప్రతినిధుల్లో కరోనా వైరస్ కలకలం మొదలైంది. విజయనగరం ఎస్ కోట వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు ట్రూ నాట్ టెస్ట్‌లో కరోనా పాజిటివ్ తేలింది. అయితే సెకండ్ ఒపీనియన్ కోసం ఆర్‌టిపిసిఆర్ టెస్ట్‌కి బ్లడ్ శాంపిల్స్ పంపారు. ఎమ్మెల్యేతో పాటు గన్‌మెన్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో కడుబండి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చిన మొదటి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావే.

ఆందోళనలో ఎమ్మెల్యేలు, ఎన్నికల సిబ్బంది, అధికారులు:
ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఎస్ కోట(శృంగవరపు కోట) వైసీపీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. కాగా, శ్రీనివాసరావు ఇటీవలే జరిగిన అసెంబ్లీ సమావేశాలు, రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులను ఆయన కలిశారట. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎన్నికల సిబ్బంది, ప్రభుత్వ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. అలాగే సోమవారం(జూన్ 22,2020) ఉదయం ఎమ్మెల్యే శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్‌తో భేటీ అయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు ప్రైమరీ కాంటాక్ట్స్‌ గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేని కలిసిన రాజకీయ నేతలు మళ్లీ కరోనా పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన ఎమ్మెల్యే:
ఎమ్మెల్యే కడుబండి జూన్ 10 న అమెరికా నుంచి వచ్చారు. ఆ సమయంలో 300 మందితో కలిసి ప్రయాణించారు. దీంతో తానే స్వయంగా టెస్ట్ చేయించుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. నాలుగుసార్లు నెగిటివ్ వచ్చిందని, ఇప్పుడు ట్రూ నాట్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిందన్నారు. ఆర్‌టిపిసిఆర్ టెస్ట్ కోసం ఎదురుచూస్తున్నానని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని ఎమ్మెల్యే తెలిపారు. తాను అమెరికా నుండి వచ్చినప్పటి నుండి కఠినంగా కోవిడ్ ప్రోటోకాల్ ను పాటిస్తున్నానని, అందరికి దూరంగానే ఉంటున్నానని ఎమ్మెల్యే వెల్లడించారు. అమెరికాలోనే ఆయనకు కరోనా సోకిందా? లేక ఏపీలోనా అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఏపీలోని శాసనసభ్యుల్లో ఇదే తొలి కరోనా కేసు.

ఒక్కరోజే 443 కరోనా కేసులు:
ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. .వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. సోమవారం(జూన్ 22,2020) ఒక్కరోజే 443 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు కరోనాతో మరణించారు. తాజాగా నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందిన వారు 392 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 44 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 7 మంది ఉన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన వివరాలను గమనిస్తే.. గడిచిన 24 గంటల్లో 16,704 మంది శాంపిల్స్ పరీక్షించగా 392 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలారు. 83 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 7,451 నమోదు కాగా, 3,437 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ కోవిడ్‌ ఆస్పత్రుల్లో 3,903 మంది చికిత్స పొందుతున్నారు.

111కి పెరిగిన కరోనా మరణాలు:
గడిచిన 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు చనిపోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 111కు పెరిగింది. అలాగే పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 9,372 కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,435 మంది డిశ్చార్జి కాగా, 4,826 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే రెండు జిల్లాలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. కర్నూలు జిల్లాలో 1354, కృష్ణా జిల్లాలో 1,063 కేసులు నమోదయ్యాయి.

Read: పేదోడి సొంతింటి కల : ఏపీలోని 8 జిల్లాలకు నిధుల విడుదల