APIIC-Industries: సింగిల్ విండో విధానం ద్వారా ఏపీలో పరిశ్రమలకు అనుమతులు: “ఏపీఐఐసీ” ఆన్‌లైన్‌ సేవలు

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు తొలగిస్తూ.. ఇకపై సింగల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులు త్వరగా లభించే విధంగా ఏపీఐఐసీ చర్యలు తీసుకుంది

APIIC-Industries: సింగిల్ విండో విధానం ద్వారా ఏపీలో పరిశ్రమలకు అనుమతులు: “ఏపీఐఐసీ” ఆన్‌లైన్‌ సేవలు

Apiic

APIIC-Industries: ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు తొలగిస్తూ.. ఇకపై సింగల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులు త్వరగా లభించే విధంగా ఏపీఐఐసీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 14 సేవలను ఆన్ లైన్ ద్వారా అందిస్తూ సోమవారం వెబ్ సైట్ ప్రారంభించారు అధికారులు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఏపీఐఐసీ అధికారిక వెబ్ సైట్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఏపీలో జిల్లాల విభజన నేపథ్యంలో పరిశ్రమలు నెలకొల్పాలనుకునే వారికి ఈ సౌకర్యలు మరింత ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Also read:Record prices : దేశీయ మిర్చి రూ.55,551, పత్తి రూ.12,110.. ఆనందంలో అన్నదాతలు

సమయం వృథా కాకుండా, గడువు నిర్దేశించుకుంటూ సింగిల్ విండో ద్వారా పూర్తి సేవలు అందిస్తున్నట్లు కరికాల వలవన్ వివరించారు. ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు నుంచి కేటాయింపులు, అనుమతులు కూడా అందడం ఎంతో ఉపశమనం కలిగించే విషయమని కరికాల వలవన్ తెలిపారు. జిల్లా స్థాయిలో జోనల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు కలిసి పని చేస్తే మరిన్ని సానుకూలా ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. ఓ చిన్న పని పూర్తవ్వాలంటే కూడా గతంలో సుమారు 6 నెలల కాలం పట్టేదని, ప్రస్తుతం ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఏపీఐఐసీలో ఏ పనైనా 15 నుంచి 20 రోజుల్లో పూర్తి చేసుకోవచ్చని వారు వివరించారు.

Also read:AP Cabinet Reshuffle : 7న ఏపీ మంత్రివర్గ సమావేశం.. 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

డాక్యుమెంట్స్, ఫైల్ మొత్తం క్లియర్ గా ఉంటే రోజుల వ్యవధిలోనే పని పూర్తవుతుందని కరికాల వలవన్ తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది లేకుండా హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఈసందర్భంగా ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది మాట్లాడుతూ 5 ప్రాథమిక సిద్ధాంతాలతో తీర్చిదిద్దిన ఏపీఐఐసీ పోర్టల్ ద్వారా 14 సేవలు అందిస్తున్నట్లు వివరించారు. పారిశ్రామికవేత్తల నుంచి మంచి స్పందన ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సింగిల్ విండో ద్వారా అనుమతులకు అప్లై చేసిన పారిశ్రామికవేత్తల ఫైళ్ళను ఎప్పటికప్పుడూ ట్రాక్ చేసి చూసుకునే సౌలభ్యం కల్పించారు.

Also read:MP Rammohan Naidu: ఏపీలో విద్యుత్ కోత..కరెంటు బిల్లుల మోత: జగన్ పాలనలో ప్రజల్లో విశ్వాసం లేదన్న రామ్మోహన్