Group-1 Mains: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధం.. పూర్తి వివరాలు

బయోమెట్రిక్ తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు.

Group-1 Mains: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధం.. పూర్తి వివరాలు

APPSC Group-1 Mains

Group-1 Mains – APPSC: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో శనివారం నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు పూర్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది.

బయోమెట్రిక్ తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించారు. ఈనెల 10 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ ఇప్పటికే గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలపై మీడియా సమావేశంలో అన్ని వివరాలు వెల్లడించారు. మెయిన్స్ పరీక్షలకు 6,455 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో పరీక్షలు జరిగే తీరును తమ ఏపీపీఎస్సీ ఆఫీసు నుంచి చూసేందుకు వీలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌ వంటి చర్యలకు పాల్పడేందుకు ఏ మాత్రం ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. పరీక్షా కేంద్రాల నుంచి కూడా ప్రశ్నాపత్రం లీకైనట్లు నిర్ధారణ