APPSC : ఏపీలో ఉద్యోగ నియామకంలో ప్రిలిమ్స్, స్క్రీనింగ్ విధానం రద్దు!

గ్రూప్‌ -2, గ్రూపు 3 సహా ఇతర క్యాడర్‌ పోస్టుల భర్తీ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) భావిస్తోంది. ఒకే ఒక పరీక్ష నిర్వహించనున్నారు. మెరిట్ అభ్యర్థుల ద్వారా మాత్రమే ఆయా పోస్టులను భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

APPSC : ఏపీలో ఉద్యోగ నియామకంలో ప్రిలిమ్స్, స్క్రీనింగ్ విధానం రద్దు!

Appsc Proposal To Cancel Prelims Group 2 And Group 3 Exams

APPSC cancel prelims group Exams : గ్రూప్‌ -2, గ్రూపు 3 సహా ఇతర క్యాడర్‌ పోస్టుల భర్తీ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) భావిస్తోంది. ఒకే ఒక పరీక్ష నిర్వహించనున్నారు. మెరిట్ అభ్యర్థుల ద్వారా మాత్రమే ఆయా పోస్టులను భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గ్రూప్‌ – 1 సహా అన్ని కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రస్తుతం ప్రిలిమ్స్‌/స్క్రీనింగ్‌ టెస్టు.. అర్హత సాధించిన వారికి మెయిన్స్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు. అయితే ఇకపై గ్రూప్‌ – 2, గ్రూప్‌ – 3 సహా ఇతర క్యాడర్‌ పోస్టులకు ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని కమిషన్‌ భావిస్తోంది. ఒక పరీక్షనే నిర్వహించి మెరిట్‌ అభ్యర్థులను సంబంధిత పోస్టులకు ఎంపిక చేయనుంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను రెడీ చేస్తున్నట్టు తెలిసింది.

ప్రిలిమ్, స్క్రీనింగ్ టెస్టుల కారణంగా విలువైన సమయం వృధాతోపాటు అభ్యర్ధులపై మానసిక వత్తిడి పడుతుండటం, దీనికి తోడు పలు కోచింగ్ సెంటర్‌లు సొమ్ము చేసుకుంటుండటంతో ఏపీపీఎస్సీ కొత్తమార్పులకు శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం గ్రూప్-1 తో సహ అన్ని కేటగిరి పోస్టుల భర్తీకి ముందుగా ప్రిలిమ్స్, స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అందులో అర్హత సాధించిన వారిని మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తున్నారు. ఈ తరహా విధానాన్ని ఒక్క గ్రూప్ 1కే పరిమితం చేయనున్నారు. మిగిలిన ఉద్యోగ నియామకాలను పరీక్ష విధానం ద్వారానే చేయాలన్న ప్రతిపాదనలను ఏపీపీఎస్సీ రెడీ చేస్తున్నట్టు సమాచారం.

గతంలో గ్రూప్‌–1 పోస్టులకే ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల విధానం జరిగేది. అయితే గ్రూప్‌–2, గ్రూప్‌–3 పోస్టులకు ఒక పరీక్ష ద్వారానే ఎంపికలు ఉండేవి. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక వారి కోచింగ్‌ సెంటర్లకు మేలు జరిగేలా పోస్టుల భర్తీ విధానాన్ని మార్చింది. గ్రూప్‌–1 సహా అన్ని పోస్టులకూ ప్రిలిమ్స్‌/స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించేలా ఆదేశాలిచ్చింది. కోచింగ్‌ కేంద్రాల దోపిడీకి ఏపీపీఎస్సీ చెక్‌పెట్టనుంది. అందులో భాగంగా ప్రిలిమ్స్‌/ స్క్రీనింగ్‌ విధానాన్ని రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది.