ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏప్రిల్ 11వ తేదీన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 05:39 AM IST
ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏప్రిల్ 11వ తేదీన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి.

హైదరాబాద్ : ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏప్రిల్ 11వ తేదీన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పట్టణాల నుంచి పల్లెబాట పట్టారు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అందుకుగానూ అన్ని చర్యలు తీసుకుంది. 465 ప్రత్యేక బస్సులు తిప్పుతోంది. రద్దీకి అనుగుణంగా ట్రిప్పులు పెంచుతామని అధికారులు అంటున్నారు.
Read Also : 11న సెలవు ప్రకటించని సంస్థలపై చర్యలు : దాన కిషోర్ ​​​​​​​

హైదరాబాద్, బెంగళూర్, చెన్నై నుంచి అమరావతికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. విజయవాడ నుంచి వెళ్లేవారికోసం అదనపు బస్సులను సిద్ధం చేసింది. సాయంత్రం లోపు ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఈడీ నాగశివుడుతో సూచిస్తున్నారు.

హైదరాబాద్ లో నివసించే ప్రజల్లో చాలా మంది తెలంగాణ వాసులతో పాటు ఏపీకి చెందినవారు కూడా ఉన్నారు. వీరందరికీ గ్రామాల్లో ఓట్లు ఉన్నాయి. ఓట్లు వేయడానికి ప్రతీసారి వారి గ్రామాలకు వెళ్తున్నారు. అభ్యర్థులను గెలిపించడానికి ఓటర్లు పయనమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణీకులతో కిటకిటలాడిపోతున్నాయి. 
Read Also : పోల్ జర్నీ : టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ