పంచరామాలకు వెళ్లాలనుకునే ప్రజలకు APSRTC గుడ్ న్యూస్

  • Published By: vamsi ,Published On : November 19, 2020 / 09:15 AM IST
పంచరామాలకు వెళ్లాలనుకునే ప్రజలకు APSRTC గుడ్ న్యూస్

కరోనా కారణంగా వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో బస్సులు కదులుతున్నాయి. ఆ క్రమంలోనే ఏపీ ప్రజలకు APSRTC గుడ్ న్యూస్ అందించింది. కార్తీక మాసంలో రాష్ట్రంలోని ఐదు పంచారమాలు అయిన పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి ప్రాంతాలను దర్శించుకునేందుకు భక్తుల కోసం అన్నీ జిల్లాల నుంచి 1,750 స్పెషల్ బస్సులను తిప్పాలని APSRTC నిర్ణయించుకుంది.



ఒక్కరోజులోనే భక్తులు ఈ ఐదు పంచారామాలను దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. మొదటి సోమవారం నాడు APSRTC రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల నుంచి పంచారామాలకు మొత్తంగా 106 బస్సులు నడపగా.. అత్యధికంగా ఉభయగోదావరి జిల్లాల నుంచి 46 బస్సులు నడిచాయి.



https://10tv.in/pawan-kalyans-comments-on-jamili-elections/
ఈ క్రమంలోనే ముఖ్యమైన కార్తీక పౌర్ణమి రోజుల్లో జనాలకు పంచరామాలకు వెళ్లే అవకాశం కల్పిస్తుంది. కరోనా కారణంగా దాదాపు నాలుగు నెలలు బస్సులు తిరగకుండా ఆగిపోగా.. అప్పుడు APSRTCకి నష్టాలు బాగా వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగవ్వగా లోటు భర్తీ చెయ్యడానికి APSRTC సిద్ధం అయ్యి కొత్త పద్దతులను ఆచరిస్తోంది.



ఇక ఇప్పటిదాకా సొంత బస్సులను మాత్రమే రోడ్డెక్కించిన APSRTC.. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి దశలవారీగా అద్దె బస్సులు తిప్పాలని నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల మీదుగా దూర ప్రాంతాల మధ్య నడిచే 290 అద్దె బస్సులు తిప్పేందుకు రంగం సిద్దం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లకు APSRTC మేనేజ్‌మెంట్ ఆదేశాలు ఇచ్చింది.