Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానానికి సేలం వినియోగదారుల కోర్టులో షాక్‌

తిరుమల తిరుపతి దేవస్థానానికి సేలం వినియోగదారుల కోర్టులో షాక్‌ తగిలింది. ఓ భక్తుడికి టీటీడీ వస్త్రం సేవా టికెట్ కేటాయించలేకపోవడంతో రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని లేదంటే సేవా దర్శన భాగ్యం కలిగించాలని ఆదేశించింది. సేలానికి చెందిన హరి భాస్కర్ అనే వ్యక్తి టీటీడీ అడ్వాన్స్ బుకింగ్‌లో మేల్‌ఛాట్ వస్త్రం సేవా టిక్కెట్ బుక్ చేసుకున్నారు. 2020, జూన్ 10న వస్త్రం టిక్కెట్టును టీటీడీ జారీ చేసింది. అయితే, కరోనా కారణంగా ఆర్జితసేవలను రద్దు చేసింది. వస్త్రం టికెట్ బదులుగా బ్రేక్ దర్శనం టికెట్లు జారీ చేస్తామని హరి భాస్కర్‌కు సమాచారం ఇచ్చింది. అయితే, వస్త్రం సేవకే అనుమతించాలని టీటీడీని హరి భాస్కర్ కోరారు. తన విజ్ఞప్తిని టీటీడీ తిరస్కరించడంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు.

Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానానికి సేలం వినియోగదారుల కోర్టులో షాక్‌

Tirupati Tirumala Devasthanam

Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానానికి సేలం వినియోగదారుల కోర్టులో షాక్‌ తగిలింది. ఓ భక్తుడికి టీటీడీ వస్త్రం సేవా టికెట్ కేటాయించలేకపోవడంతో రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని లేదంటే సేవా దర్శన భాగ్యం కలిగించాలని ఆదేశించింది. సేలానికి చెందిన హరి భాస్కర్ అనే వ్యక్తి టీటీడీ అడ్వాన్స్ బుకింగ్‌లో మేల్‌ఛాట్ వస్త్రం సేవా టిక్కెట్ బుక్ చేసుకున్నారు. 2020, జూన్ 10న వస్త్రం టిక్కెట్టును టీటీడీ జారీ చేసింది. అయితే, కరోనా కారణంగా ఆర్జితసేవలను రద్దు చేసింది.

వస్త్రం టికెట్ బదులుగా బ్రేక్ దర్శనం టికెట్లు జారీ చేస్తామని హరి భాస్కర్‌కు సమాచారం ఇచ్చింది. అయితే, వస్త్రం సేవకే అనుమతించాలని టీటీడీని హరి భాస్కర్ కోరారు. తన విజ్ఞప్తిని టీటీడీ తిరస్కరించడంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. మేల్‌ఛాట్ వస్త్ర సేవ టిక్కెట్టు కొన్న భక్తుడికి దర్శనం కల్పించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఏడాదిలోగా మేల్‌ఛాట్‌ వస్త్ర సేవ టికెట్టు కేటాయించాలని, లేకుంటే రూ.50 లక్షల నగదు చెల్లించాలని కోర్టు చెప్పింది.

సేలం కన్జ్యూమర్ కోర్టు తీర్పుపై టీటీడీ అప్పీల్ కు వెళ్ళనుంది. మరోవైపు, ఆర్జిత సేవా టికెట్లు ఉండి స్వామివారి దర్శనం కల్పించలేదని ఇప్పటికే కోర్టును మరో 10 మంది భక్తులు ఆశ్రయించారు. కరోనా కారణంగా 2020, మార్చి 20 నుంచి 2022, మార్చి వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో అడ్వాన్స్ రిజర్వేషన్ లో మొత్తం 17,946 ఆర్జిత సేవా టికెట్లను భక్తులు పొందారు. టికెట్లు కలిగిన భక్తులుకు సేవలను రద్దు చేసిన కారణంగా నగదు తిరిగి ఇచ్చేయడం లేదా వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. టీటీడీ ఆఫ్షన్ ను95 శాతం మంది భక్తులు వినియోగించుకున్నారు. మరికొందరు భక్తులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఇందులో టీటీడీకి అనుకూలంగా తీర్పు వచ్చింది.

Pakistan floods: వరదలతో అతలాకుతలం.. ప్రపంచ దేశాల సాయం కోరుతూ పాకిస్థాన్ అభ్యర్థన