Asani Cyclone: వాయుగుండంగా మారిన అసని: కోస్తాజిల్లాల్లో వర్షాలు, భారీగా పంట నష్టం

గురువారం ఉదయానికి నర్సాపురం, యానాం, కాకినాడ, తుని, విశాఖ జిల్లా మీదుగా పయనిస్తుంది. తుఫాను ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి

Asani Cyclone: వాయుగుండంగా మారిన అసని: కోస్తాజిల్లాల్లో వర్షాలు, భారీగా పంట నష్టం

Asani

Asani Cyclone: తీవ్ర తుఫాను అసని ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతుంది. బుధవారం సాయంత్రం మచిలీపట్నం-నర్సాపురం వద్ద తీరం దాటిన తుఫాను..దిశలు మార్చుకుంటూ ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుంది. గురువారం సాయంత్రానికి తిరిగి బంగాళఖాతంలోకి ప్రవేశిస్తుంది. గురువారం ఉదయానికి నర్సాపురం, యానాం, కాకినాడ, తుని, విశాఖ జిల్లా మీదుగా పయనిస్తుంది. తుఫాను ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం నర్సాపూర్ కి దక్షిణ నైరుతిగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన అసని..గురువారం రాత్రికి పశ్చిమమధ్య బంగాళఖాతంలోకి ప్రవేశిస్తుంది.

Also read:Cyclone Asani Impact : అసని తుపాను.. వాయుగుండంగా మారి బలహీనపడుతుంది

అసని తుఫాను ప్రభావంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. కోనసీమ జిల్లాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో వందల ఎకరాల్లోని అరటి, మొక్కజొన్న తోటలు ధ్వంసం అయ్యాయి. తుఫాను ధాటికి ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో బొప్పాయి, మామిడి, అరటి పంటలు నాశనం అయ్యాయి. దక్షిణ కోస్తాలో వర్షం కంటే ఈదురు గాలుల కారణంగా అధిక నష్టం వాటిల్లింది. తుఫాను ప్రభావంతో పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల ధాటికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది.

Also read:Cyclone Asani Weakens : బలహీనపడిన అసని తుపాను.. భారీ నుండి అతి భారీ వర్ష సూచన