Ashok Gajapathi Raju : పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న అశోకగజపతి రాజు

విజయనగరం పైడితల్లి అమ్మవారిని మాజీ కేంద్రమంత్రి అశోకగజపతి రాజు దర్శించుకున్నారు. సంప్రదాయ పద్దతులలో అశోకగజపతి రాజుకి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నారు.

Ashok Gajapathi Raju : పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న అశోకగజపతి రాజు

Ashok Gajapathi Raju Visits Paidithalli Ammavaru In Vizianagaram

Ashok Gajapathi Raju Visits Paidithalli Ammavaru : విజయనగరం పైడితల్లి అమ్మవారిని మాజీ కేంద్రమంత్రి అశోకగజపతి రాజు దర్శించుకున్నారు. సంప్రదాయ పద్దతులలో అశోకగజపతి రాజుకి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అశోకగజపతి రాజును తిరిగి సింహాచలం దేవస్థానంకు మాన్షన్ ట్రస్ట్‌కు ఛైర్మెన్‌గా కొనసాగించాలని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ శ్రేణులు అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టారు. కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నారు. అశోకగజపతి రాజు వెంట ఎమ్మెల్సీలు సంధ్యారాణి ,ద్వారాపురెడ్డి జగదీష్ తదితరులు అమ్మవారి ఆలయ దర్శనానికి వచ్చారు.

అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మాన్సాన్ ట్రస్ట్ చైర్మన్ నియామక జీవోను హైకోర్టు కొట్టివేసింది. గజపతి రాజును ట్రస్ట్ చైర్మన్ గా పునరుద్దరించాలని ఆదేశాల్లో పేర్కొంది. జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో అశోక్ గజపతిరాజు పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ప్రభుత్వం జారీ చేసిన సంచయిత గజపతిరాజు నియామక జీవో 72ను రద్దు చేసింది. వారహలక్ష్మీ నరసింహ దేవస్థానానికి, మాన్షన్ ట్రస్ట్‌కు ఆయనే చైర్మన్‌గా ఉండేలా కోర్టు ఆదేశాల్లో పేర్కొంది.

గతంలో మాన్సాస్ ట్రస్టీ, వారహలక్ష్మీ నరసింహ దేవస్థానం చైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతి రాజును ప్రభుత్వం తొలగించింది. ఆ స్థానంలో సంచయితను నియమిస్తూ 72 జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి చైర్మన్‌గా అశోక్ గజపతి రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. మాన్షన్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా సంచయిత నియామకం చెల్లదని సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్లో పేర్కొంది.