Attack : టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర వాహనంపై దాడి

ధూళిపాళ్లకు వ్యతికేంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో ధూళిపాళ్ల నరేంద్ర కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు.

Attack : టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర వాహనంపై దాడి

Attack

attacked Narendra car : గుంటూరు జిల్లా అనుమర్లపూడిలో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కారుపై దాడి జరిగింది. ఈ దాడిలో ధూళిపాళ్ల కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అనుమర్లపూడి చెరువులో మట్టి తవ్వకాల పనులను పరిశీలించేందుకు వెళ్లిన ధూళిపాళ్లను వైసీపీ మట్టి మాఫియా సభ్యులు అడ్డుకున్నారు.

ధూళిపాళ్లకు వ్యతికేంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో ధూళిపాళ్ల నరేంద్ర కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. పొన్నూరు నియోజకవర్గంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.

CM Jagan : జగన్ వద్దకు గన్నవరం, బందరు పంచాయితీలు

జగనన్న కాలనీ పేరుతో పంచాయతీ తీర్మానం చేసి ఇతర ప్రాంతాలకు మట్టి తరలిస్తున్నారని ధూళిపాళ్ల ఆరోపించారు. ట్రాక్టర్ మట్టి వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇలా దౌర్జన్యాలు చేస్తే భవిష్యత్తులో అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.