Konaseema : పచ్చగా ఉండే కోనసీమ ఎర్రబడిపోయింది
జస్ట్ జిల్లా పేరుకు ముందు అంబేద్కర్ అన్న పేరు పెట్టాలన్న ప్రతిపాదనే ఇంతటి రణానికి కారణమైంది. వాస్తవానికి జిల్లా పేరు మార్పుపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

Attacks in Konaseema : పచ్చగా ఉండే కోనసీమ మొత్తం ఎర్రబడిపోయింది. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా దాడులు, దహనాలు చోటు చేసుకున్నాయి. రాళ్ల దాడి జరిగింది. చివరికి ఎస్పీని కూడా వదిలి పెట్టలేదు. బస్సులు కనిపిస్తే నిప్పు పెట్టారు. మంత్రి ఇంటిని కాల్చి బూడిద చేశారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఇంటినీ తగలబెట్టారు. చివరికి మంత్రి కొత్తగా కట్టుకుంటున్న ఇంటినీ వదల్లేదు. కొద్ది రోజులుగా అమలాపురంలో ఆందోళనలు జరుగుతున్నా… ఇంత స్థాయి రియాక్షన్ వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే.. ఈ ఆందోళనలకు పిలుపునిచ్చింది ఏ రాజకీయ పార్టీ కాదు.. ఉద్రిక్తతల వెనుక ఏ బలమైన లీడర్ లేడు.
జస్ట్ జిల్లా పేరుకు ముందు అంబేద్కర్ అన్న పేరు పెట్టాలన్న ప్రతిపాదనే ఇంతటి రణానికి కారణమైంది. వాస్తవానికి జిల్లా పేరు మార్పుపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కోనసీమ పరిరక్షణ జేఏసీ మాత్రం.. కోనసీమనే కంటిన్యూ చేయాలని డిమాండ్ చేసింది. మార్చకుంటే ఆందోళన చేస్తామంది.. నిన్న కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని అనుకున్నది. కానీ.. వారు కలెక్టరేట్ వద్దకు వెళ్లగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ధర్నా చేశారు. పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో అక్కడ పడింది ఉద్రిక్తతలకు మూలం. పోలీసుల దాడితో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. పోలీసులను కూడా లెక్కచేయలేనంతగా మారారు.
Konaseema : నివురుగప్పిన నిప్పులా కోనసీమ
వాట్సాప్‌లో మెసేజ్‌లు ఫార్వార్డ్ చేయడంతో.. పదుల సంఖ్యలో ఉన్న వారు వందల సంఖ్యలో జమయ్యారు.. వందల మంది వేల మందిగా మారారు. ఎవరి మద్దతూ లేని ఆందోళన పెద్దగా జరగదనుకున్నారు పోలీసులు. కానీ అక్కడ జరిగింది వేరు. స్కెచ్ ప్రకారం దాడులు జరిగాయి. ముందుగా కలెక్టరేట్ పై.. ఆ తర్వాత మంత్రులు.. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు జరిగాయి. ఇంత జరుగుతున్న విషయాన్ని పోలీసులు కనీసం గుర్తించలేకపోయారు. పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ విషయంలో ఘోరంగా ఫెయిలయిందన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఇంతపెద్ద విధ్వంసం జరుగుతుందని తెలిస్తే.. పోలీసుశాఖలో ఉన్న అన్నిరకాల వ్యవస్థల్లో.. ఏ ఒక్క దానికైనా సమాచారం అందుతుంది.
దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకుంటున్నారు. అమలాపురంలో జరిగిన ఘర్షణల విషయంలో అలాంటి కనీస సమాచారం పోలీసు శాఖకు అందలేదు. ఆందోళనకారులు విరుచుకుపడబోతున్నారన్న కనీస సమాచారం పోలీసులకు లేదు. అంతమంది ఆందోళన చేస్తారని కూడా పోలీసులు ఊహించలేకపోయారు. ఉద్రిక్తతలు ఉన్నా.. అమలాపురంలో పోలీసులు మూడు వందల మంది మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. అదనపు పోలీసు బలగాలు లేవు. దీంతో ఆందోళనకారులకు ఎదురు లేకుండా పోయినట్లయింది. పోలీసులు చేతులెత్తేశారన్న ప్రచారం జరగడం.. స్వయంగా ఎస్పీ సుబ్బారెడ్డి కూడా గాయాలపాలయ్యారని ప్రచారం జరగడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు.
భయం లేకుండా దాడులకు పాల్పడ్డారు. ఇంకా వైపల్యం ఏమిటంటే.. విధ్వంసం ప్రారంభమైన తర్వాత కూడా పోలీసు బలగాలు.. పెద్ద ఎత్తున చేరుకోలేకపోయాయి. సమన్వయం లేకపోవడంతో చీకటి పడిన తర్వాతనే వచ్చాయి. అప్పటికే జరగాల్సిన విధ్వంసం అంతా జరిగిపోయింది. పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలం కావడం ఇదే మొదటి సారి కాదు. విజయవాడలో ఉద్యోగులునిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విషయంలోనూ ఇంటెలిజెన్స్ ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అమలాపురం విషయంలోనూ అదే పరిస్థితి.
- Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో మరో 25 మంది అరెస్ట్
- Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు
- Konaseema Internet Shutdown : వర్క్ ఫ్రమ్ గోదారి గట్టు.. కోనసీమలో ఐటీ ఉద్యోగుల కష్టాలు
- కోనసీమ అల్లర్లలో రౌడీషీటర్లు
- Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
1కొల్లాపూర్ పంచాయితీపై కేటీఆర్ ఫోకస్
2రెబల్స్‌కు నోటీసులు.. గేమ్ మొదలెట్టిన సీఎం ఠాక్రే
3Vijayawada : రేపటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోగాకు నిషేధం
4PM Modi: జీ7 సదస్సులో పాల్గొననున్న మోదీ
5Shah Rukh Khan: 30 ఏళ్ల సినీ కెరీర్లో షారుఖ్‌ను ‘కింగ్’ ఖాన్ చేసిన డైలాగులు ఇవే!
6Himachal Pradesh : బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. భార్యకు చంద్రుడుపై స్థలం కొన్న భర్త
7Village ward secretariat employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది.. భారీగా పెరిగిన జీతాలు
8Navneet Rana: ‘మహా’లో రాష్ట్రపతి పాలన విధించండి: అమిత్ షాను కోరిన నవనీత్ రాణా
9కిడ్నాప్ కేసును 12గంటల్లో ఛేదించిన పోలీసులు
10Venkatesh: మల్టీస్టారర్‌కే చిరునామా.. సోలోగా రావా వెంకీ మామ..?
-
Apple AirPods Pro : ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోలో హెల్త్ ఫీచర్లు.. అవేంటో తెలుసా?
-
Sita Ramam: సీతా రామం.. యుద్ధంతో రాసిన ప్రేమాయణం!
-
Nithiin: మాచర్ల నియోజకవర్గంలో పనులు పూర్తి.. ఇక మిగిలింది ఒకటే!
-
Rainbow Diet : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే రెయిన్ బో డైట్!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఒకటి కాదు రెండు!
-
Rainy Season : వర్షాకాలం ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు!
-
Harish Shankar: పవన్ నిర్ణయంతో ఆ హీరో చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న హరీష్..?
-
Hair Health : జుట్టు ఆరోగ్యానికి ఇలా చేస్తే సరి!