NTR : అన్న ‌ఎన్టీఆర్ కుటుంబానికి కూడా అచ్చిరాని ఆగస్ట్.. అన్నీ విషాదాలే..!

ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో... ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆగస్టు నెలలోనే ఎన్టీఆర్ కుటుంబంలో ఎన్నో విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు కుటుంబ పరంగా కానీ, అటు రాజకీయం గా అయినా ఆగస్టు నెల ఎన్టీ ఆర్ కు అచ్చుబాటు కాలేదు.

NTR : అన్న ‌ఎన్టీఆర్ కుటుంబానికి కూడా అచ్చిరాని ఆగస్ట్.. అన్నీ విషాదాలే..!

NTR :  మాజీ ముఖ్యమంత్రి దివంగత నటుడు నందమూరి తారక రామారావు కుటుంబంలో నిన్న విషాదం చోటు చేసుకుంది.  ఎన్టీఆర్ చిన్న కూమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ వార్తల్లో నిలిచారు. మరోవైపు ఆగస్టు నెల ఎన్టీఆర్ కుటుంబానికి అచ్చిరావట్లేదని చర్చ కూడా మొదలయ్యింది. ఎందుకంటే ఆగస్టు నెలలోనే ఎన్టీఆర్ కుటుంబంలో ఎన్నో విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు కుటుంబ పరంగా కానీ, అటు రాజకీయం గా అయినా ఆగస్టు నెల ఎన్టీ ఆర్ కు అచ్చుబాటు కాలేదు.

ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో… ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి సోమవారం, ఆగస్టు1 ఉదయం తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె తన గదిలోనే చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆమె ఆత్మహత్యతో ఎన్టీఆర్ కుటుంబంలో జరిగిన విషాద ఘటనలో మరో సారి తెరపైకి వచ్చాయి.  ఎన్టీఆర్‌కు ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు. అందులో మొదటి కొడుకు రామకృష్ణ పదేళ్ల వయసులోనే మసూచి సోకి మరణించాడు. దీంతో ఏడవ సంతానానికి ఎన్టీఆర్ మళ్లీ రామకృష్ణ అనే పేరే పెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మూడో కుమారుడు సాయికృష్ణ మరణించడం నందమూరి ఫ్యామిలీలో తీవ్ర నిషాదం నింపింది.

ఎన్టీఆర్ కుటుంబానికే కాదు.. ఎన్టీఆర్   పెట్టిన  తెలుగుదేశం పార్టీకి కూడా ఆగష్టు నెల ఏ మాత్రం కలిసి రాలేదు. . ఆగష్టు 1984లో, నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. పార్టీ స్థాపకుడు ఎన్‌టి రామారావు ఆగస్టులో రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఇది టీడీపీ సర్కిల్‌ల్లో సాధారణంగా చెడు శకునాలను సూచించే నెలగా పరిగణిస్తారు. టీడీపీ పార్టీ ఎప్పుడూ ఆగస్ట్ నెలలోనే ఎన్నో చేదు అనుభవాలను చవి చూసింది. ఈ ఆగస్టు నెల సెంటిమెంట్ కారణంగా, టీడీపీ నాయకులలో టెన్షన్ నెలకొంది.

ఇక 1995లో ఆగస్ట్ సంక్షోభంలో చంద్ర బాబే స్వయంగా అన్న గారికి వెన్నుపోటు పొడిచారు. అప్పుడు జరిగిన వైస్రాయ్ హోటల్  స్కెచ్‌తో ఇక ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదు. ఇప్పుడు ఉమా మహేశ్వరి కూడా ఆగష్టు నెలలోనే ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడంతా ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీకి ప్రజల్లో ఉన్న ఇమేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు… ఆమె కుటుంబం నుంచి చూస్తే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, అక్క కేంద్ర మాజీ మంత్రి… అన్న.. మేనలుళ్లు సినిమాల్లో విశేష జనాదరణ పొందిన హీరోలుగా పేరు సంపాదించిన సంగతి తెలిసిందే.

ఇంతటి గొప్ప నేపధ్యం ఉన్న కుటుంబంలోని   ఉమామహేశ్వరి   ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్టీఆర్  ఫ్యామిలీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఉమా మహేశ్వరి గత కొన్నిరోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె యాంటీ డిప్రెషన్ మందులు కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న ఉదయం టిఫిన్ చేసి తన గదిలోకి వెళ్లిన ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ముందుగా ఆమె కూతురు బాలకృష్ణకు కాల్ చేసి చెప్పింది. ఆ తర్వాత చంద్రబాాలు లోకేష్‌కు సమాచారం అందించింది. ఉమా మహేశ్వరి మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఆమె మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఎన్టీఆర్ కు రాజకీయ పరంగా ఆగస్టు నెల అచ్చి రాలేదనే విషయం తెలిసిందే. ఇక కుటుంబం లో చూసుకుంటేఎన్టీ ఆర్ నాలుగో కుమారుడు నందమూరి హరికృష్ట నెల్లూరు పెళ్లికి వెళ్తూ 2019 ఆగస్టు29న రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఆగస్టులోనే బలవన్మరణానికి పాల్పడచంటంతో అందరూ ఇదే విషయం చర్చించుకుంటున్నారు.

Also Read : Uma Maheshwari : ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య.. కారణం ఏంటి? అసలేం జరిగింది?