ఏపీలో అత్యధిక ప్రాజెక్టులు ఆ సంస్థకే, కాకినాడ పోర్టులో మెజార్టీ వాటా

ఏపీలో అత్యధిక ప్రాజెక్టులు ఆ సంస్థకే, కాకినాడ పోర్టులో మెజార్టీ వాటా

Aurobindo Company Got More Contracts in AP : ఆంధ్రప్రదేశ్‌లో అధిక శాతం ప్రాజెక్ట్‌లు అరబిందో రియాల్టీ సంస్థ (Aurobindo) కే దక్కుతున్నాయి. అరబిందో వ్యూహాత్మకంగా భారీ కాంట్రాక్ట్‌లను చేజిక్కిచుకుంటోంది. జీఎంఆర్ (GMR) చేతిలో ఉన్న కాకినాడ ఎస్ఈజెడ్‌ (SEZ) లో మెజారిటీ వాటాలను అరబిందో (Aurobindo) రియాల్టీ దక్కించుకుంది. జీఎంఆర్ సంస్థ (GMR) 2 వేల 600 కోట్ల రూపాయలకు ఈ వాటాను విక్రయించింది. ఏపీకి కేంద్రం బల్క్ డ్రగ్ పార్కు కేటాయిస్తే అది కూడా అరబిందో (Aurobindo) చేతికే వెళుతుందనే ప్రచారం జరుగుతోంది.

దాన్ని దృష్టిలో పెట్టుకునే కేఎస్ఈజెడ్‌ (KSEZ)ను అరబిందో రియాల్టీ సంస్థ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ పార్కు రాష్ట్రానికి వస్తే మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం వెయ్యి కోట్ల రూపాయల మేర కేటాయించే అవకాశం ఉంది. కాకినాడలోని కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్‌లో అరబిందో రియాల్టీకి 41.12 శాతం వాటా బదిలీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ప్రైవేట్ డీల్ అయినా ప్రభుత్వ అనుమతి అవసరం. దీంతో KSPLలో అరబిందో రియాల్టీ అతి పెద్ద వాటాదారుగా అవతరించింది. కొత్తగా చేపట్టనున్న మచిలీపట్నం ఓడరేవులో కూడా అరబిందో రియాల్టీ భాగస్వామిగా ఉండే అవకాశం ఉందని వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో పోర్టుల నిర్మాణంపై కాంట్రాక్టులు ఎక్కువగా రానున్నందున అరబిందో రియాల్టీ పోర్టులపై దృష్టి పెట్టింది.