కూతురిలా పెంచాను, నన్నే చంపాలనుకుంది.. మాజీమంత్రి అఖిలప్రియపై టీడీపీ నేత సంచలన ఆరోపణలు

కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. మాజీ మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు ముదిరాయి. అఖిలప్రియ

  • Published By: naveen ,Published On : June 6, 2020 / 06:19 AM IST
కూతురిలా పెంచాను, నన్నే చంపాలనుకుంది.. మాజీమంత్రి అఖిలప్రియపై టీడీపీ నేత సంచలన ఆరోపణలు

కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. మాజీ మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు ముదిరాయి. అఖిలప్రియ

కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. మాజీ మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు ముదిరాయి. అఖిలప్రియ దంపతులపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అఖిలప్రియ దంపతులు తన హత్యకు సుపారీ ఇచ్చారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మార్చిలోనే తనపై హత్యకు ప్రయత్నం జరిగిందన్నారు. అఖిలప్రియకు తనకు మధ్య ఎలాంటి ఆర్థిక విబేధాలు లేవన్నారాయన. రాజకీయంగా తనను చంపాల్సిన అవసరం ఏమందో అఖిలప్రియ చెప్పాలని డిమాండ్ చేశారు. 

నేను టీడీపీలోనే ఉంటా:
నా కార్యకర్తలను కాపాడుకుంటాను అని చెప్పిన సుబ్బారెడ్డి తాను టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. 30ఏళ్లు భూమా కుటుంబానికి అండగా ఉన్నానని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. భూమా నాగిరెడ్డిని భుజాలపై తీసుకెళ్లి నామినేషన్ వేయించానని తెలిపారు. నా కూతుళ్లతో సమానంగా అఖిల పెరిగిందన్నారు. అలాంటి తనతో అఖిలప్రియ ఎందుకిలా చేస్తోందో అర్థం కావడం లేదని సుబ్బారెడ్డి వాపోయారు. భూమా కుటుంబానికి ఎంతో సన్నిహితంగా మెలిగిన తననే చంపడానికి అఖిల ప్రయత్నించిందంటే, ఆమె మైండ్ సెట్ ఏంటో ప్రజలకు తెలియాలన్నారు. మీ అమ్మానాన్న నేను కష్టపడితేనే నువ్వు గెలిచావు అని అఖిలను ఉద్దేశించి ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. అఖిలప్రియ ప్రజాభిమానంతో గెలవలేదని ఆయన చెప్పారు. అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య వివాదం రాజకీయవర్గాలతో పాటు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.

అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జస్వంతి ఆగ్రహం
* అఖిలప్రియ తన తీరు మార్చుకోవాలి
* హత్యాయత్నం కేసులో అఖిలప్రియ ముద్దాయి
* అఖిలను అరెస్ట్ చేస్తే నిజాలు బయటపడతాయి
* భూమానాగిరెడ్డి చనిపోయిన బాధ ఏంటో అఖిలకు తెలుసు
* ఇప్పుడు మమ్మల్ని కూడా అలా బాధపెట్టాలనుకుంటుందా
* రాజకీయంగా అడ్డు ఉంటే చంపుతుందా
* నేను రాజకీయాల్లోకి వస్తే నన్నూ చంపుతుందా
* టీడీపీ కూడా ఇలాంటివి ప్రోత్సహించదు
* అఖిలప్రియను పార్టీ కట్టడి చేయాలి
* టికెట్ ఇస్తే టీడీపీ నుంచి పోటీకి సిద్ధం
* అవసరమైతే మా నాన్నను చంద్రబాబుతో మాట్లాడాలని చెబుతా
* నాకు రాజకీయాలు ఇష్టం లేదు
* ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా రాజకీయాల్లోకి రావాలనిపిస్తుంది
 

Read: సొంత పార్టీ నేతల విమర్శలు.. రంగంలోకి జగన్.. ఇసుకపై కీలక నిర్ణయాలు