Avanthi Srinivas Slams Chandrababu : చంద్రబాబు, పవన్ కలిసొచ్చినా జగన్‎ను ఏమీ చేయలేరు, వైసీపీ గెలుపు ఖాయం-అవంతి

చంద్రబాబు చాలా భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారాయన. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసి వచ్చినా.. జగన్ ను ఏమీ చేయలేరన్నారు.(Avanthi Srinivas Slams Chandrababu)

Avanthi Srinivas Slams Chandrababu : చంద్రబాబు, పవన్ కలిసొచ్చినా జగన్‎ను ఏమీ చేయలేరు, వైసీపీ గెలుపు ఖాయం-అవంతి

Avanthi Srinivas Slams Chandrababu

Avanthi Srinivas Slams Chandrababu : ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. క్విట్ ఇండియా ఉద్యమం లాగే క్విట్ జగన్ ఉద్యమం రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనికి వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

తాజాగా మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు చాలా భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారాయన. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసి వచ్చినా.. జగన్ ను ఏమీ చేయలేరు అన్నారు. వైసీపీ పాలనలో కోటి 25 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలతో లబ్ది చేకూరితే, ఆ లబ్దిదారుల్లో 40శాతం మంది టీడీపీకే చెందిన వారు ఉన్నారని అవంతి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు అవంతి శ్రీనివాస్.(Avanthi Srinivas Slams Chandrababu)

Chandrababu Naidu: ‘క్విట్ ఇండియా ఉద్యమం లాగే క్విట్ జగన్ ఉద్యమం చేపట్టాలి’ : చంద్రబాబు

జగన్ ది ఐరన్‌ లెగ్‌ అని, ఆయ‌న పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం దివాలా తీసిందని చంద్ర‌బాబు చేసిన విమ‌ర్శ‌లపై అవంతి శ్రీనివాస్ మండిప‌డ్డారు. జగన్ ది ఐరన్ లెగ్ అంటూ చంద్రబాబు చేసిన‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు.

సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విశాఖలో ఏం దోచుకున్నారో చంద్ర‌బాబు చెప్పాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు అమరావతి మీదే ప్రేమ ఉందని అన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని వ‌ద్ద‌ని చంద్ర‌బాబు అంటే ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఈ విష‌యంపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయ‌న నిల‌దీశారు. విశాఖలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాల‌ని, ఇలా చేస్తే ప్రజల తీర్పు ఏమిటో తెలుస్తుందని ఆయ‌న స‌వాల్ విసిరారు.

కాకినాడలో ప్రత్తిపాడు, తుని అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు చంద్రబాబు. ఇందులో సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. టెన్త్ క్లాస్ పరీక్షలు సజావుగా నిర్వహించలేని ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట అంటూ ఎద్దేవా చేశారు.(Avanthi Srinivas Slams Chandrababu)

AP politics : జనసేనకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్న పార్టీలు..దోస్తీ కోసం టీడీపీ, బీజేపీ ప్రయత్నాలు

తాను ఐటీ ఉద్యోగాల ద్వారా కోట్లు సంపాదించుకునే అవకాశాలు కల్పించానని, కానీ సీఎం జగన్ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి రూ.5 వేలు విసిరేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఏపీని అన్ని విధాలా భ్రష్టు పట్టించడానికి సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. క్విట్ జగన్… సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదం చేశారు. దేశంలోనే పెట్రో ధరలు మండిపోతున్న రాష్ట్రం ఏపీ అని చంద్రబాబు అన్నారు. ఏపీ నుంచి విదేశాలకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు పంపే పరిస్థితి నెలకొందని, రాష్ట్ర భవిష్యత్ ను జగన్ అంధకారంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు.

Ap cm jagan: నారాయణ, చైతన్య స్కూల్స్ నుంచే టెన్త్ పేపర్ లీక్.. జగన్‌కు మంచిపేరు రాకూడదనే..