బాబు, జగన్ పార్టీలకు డిపాజిట్లు రావు: కేఏపాల్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, గత నెలరోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తున్న క్రైస్తవ మతబోధకుడు కేఏపాల్ తాజాగా బుధవారం విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో బాబు, జగన్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు రావని జోస్యం చెప్పారు.

  • Published By: chvmurthy ,Published On : January 16, 2019 / 02:25 PM IST
బాబు, జగన్ పార్టీలకు డిపాజిట్లు రావు: కేఏపాల్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, గత నెలరోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తున్న క్రైస్తవ మతబోధకుడు కేఏపాల్ తాజాగా బుధవారం విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో బాబు, జగన్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు రావని జోస్యం చెప్పారు.

విజయవాడ: జగన్ కేటీఆర్ కలిసినందుకు ధన్యవాదాలు. వైసీపీ తరుఫున ఏపీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్  ప్రచారం చేయాలని కోరుకుంటున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏపాల్ అన్నారు. కేసీఆర్ ప్రచారం చేస్తే జగన్ కు డిపాజట్లు కూడా రావని ఆయన  జోస్యం చెప్పారు. చంద్రబాబును ప్రజలు నమ్మట్లేదని, వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలిచేది ప్రజాశాంతి పార్టీనే అని చెప్పుకొచ్చారు. నేనంటే కేసీఆర్ కు చాలా అభిమానమని, జగన్ పై 12 ఈడీ కేసులున్నాయని  బుధవారం విజయవాడలో జరిగిని విలేకరులసమావేశంలో పాల్ తెలిపారు.
నామీద కేసులు వేసుకోండి
జగన్ ,కేటీఆర్ భేటీపై విమర్శించిన ఆయన  చివరికి బీజేపీని వదల్లేదు. కన్నా లక్ష్మినారాయణ తనను కలిసి తెలంగాణలో టీఆర్ఎస్ కి మద్దతివ్వమని కోరారని, ఆయన ఆరోజు ఎందుకిలా అడిగారో ఈరోజు అర్ధమైందని తెలిపారు.జగన్, బీజేపీ,టీఆర్ఎస్ ఈ మూడు ఒక్కటే అని పాల్ అన్నారు. మోడీకి నాకంటే గతంలో సన్నిహితులు ఎవరూ లేరని, గత ఎన్నికల ముందు బీజేపీకి నేను మద్దుత ఇస్తానంటే ఎల్ కే అద్వానీ  వద్దన్నారని ,ఎందకంటే మోడీ మోసగాడు ,నన్నే మోసం చేసాడు అని అద్వానీ అన్నారని పాల్ చెప్పారు.మోడీ అవే మోస పూరిత రాజకీయాలు ఏపీలో చేస్తున్నారని పాల్ ఆరోపించారు.  నామీద అవినీతి కేసులు ఉంటే బీజేపీ వారు కేసులు  వేసుకోవచ్చని కేఏపాల్  బీజేపీ కి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.