Badvel Bypoll : వైసీపీకి మద్దతుగా చంద్రబాబు నిర్ణయం

కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నిక పోటీ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉపఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో

Badvel Bypoll : వైసీపీకి మద్దతుగా చంద్రబాబు నిర్ణయం

Badvel Bypoll

Badvel Bypoll : కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నిక పోటీ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉపఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందుకు పోటీ చేయడానికి టీడీపీ విముఖత చూపింది. కాగా, జనసేన కూడా ఇప్పటికే పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ మాత్రం పోటీ చేస్తామని చెబుతోంది.

ఆదివారం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. బద్వేల్ ఉప ఎన్నిక, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. తొలుత బద్వేల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దించాలని భావించిన టీడీపీ.. ఆ తరువాత వెనక్కి తగ్గింది. పోటీపై పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. సుదీర్ఘంగా చర్చించారు. చివరికి బద్వేల్ బరి నుంచి తప్పుకోవాలని టీడీపీ నిర్ణయించింది. చనిపోయిన ప్రజా ప్రతినిధి కుటుంబం నుంచి అభ్యర్థి పోటీలో ఉంటే.. సాంప్రదాయం ప్రకారం పోటీ చేయకూడదని పొలిట్ బ్యూరో సమావేశంలో టీడీపీ నేతలు నిర్ణయించారు. పొలిబ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని సమావేశం అనంతరం టీడీపీ అధికారికంగా ప్రకటించింది.

Google ban: జాగ్రత్త! మీ ఫోన్‌లో ఈ 136 డేంజరస్ యాప్‌లు ఉంటే, బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు పోవచ్చు

జనసేన కూడా బద్వేల్ ఉప ఎన్నిక బరినుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతపురంలో జరిగిన జనసేన బహిరంగ సమావేశంలో ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. చనిపోయిన ఎమ్మెల్యే గౌరవార్థం పోటీ నుంచి తప్పుకుంటున్నామని పవన్ స్పష్టం చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి చెందిన వారికే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

బద్వేల్ ఉపఎన్నికలో మిత్రపక్షమైన జనసేన పోటీకి నై అనగా.. బీజేపీ మాత్రం సై అంటోంది. బద్వేల్‌లో బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని, ఇదే విషయాన్ని జాతీయ నాయకత్వానికి తెలియజేశామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలిపారు. త్వరలోనే తమ అభ్యర్థిని ఖరారు చేస్తామన్నారు.

Amazon Festival Sale : స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ప్రైమ్ యూజర్లకు బెనిఫిట్స్!

బద్వేల్ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడిస్తారు. నియోజకవర్గం పరిధిలో మొత్తం 2 లక్షల 16 వేల 139 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1 లక్షా 7 వేల 340 మంది మహిళా ఓటర్లు, లక్షా 8 వేల 799 మంది పురుష ఓటర్లు ఉన్నారు.

బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. డాక్టర్ వెంకట సుబ్బయ్య స్వస్థలం కడప జిల్లా బద్వేలు మండలోని మల్లెలవారిపల్లి. మారుమూల గ్రామంలో జన్మించిన వెంకట సుబ్బయ్య చిన్నతనం నుంచి చదువులో ప్రతిభచూపి వైద్య విద్యను అభ్యసించారు. 2016లో బద్వేల్‌ వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. 2019లో తొలిసారిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఓబులాపురం రాజశేఖర్‌పై 44 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

బద్వేల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ వైసీపీ.. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధను తమ అభ్యర్థిగా ప్రకటించింది.