Balineni Srinivas Reddy : పార్టీ వీడేందుకే.. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలపై బాలినేని హాట్ కామెంట్స్

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అవాస్తవం అని ఆయన అన్నారు. టీడీపీలోకి పోవాలనుకునే వాళ్లే ఇలాంటివి చెబుతారని ఎదురుదాడికి దిగారు. వైసీపీకి నష్టం చేసి టీడీపీలోకి వెళ్లిపోవాలని చూస్తున్నారని బాలినేని ఫైర్ అయ్యారు.

Balineni Srinivas Reddy : పార్టీ వీడేందుకే.. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలపై బాలినేని హాట్ కామెంట్స్

Balineni Srinivas Reddy : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అధికార పార్టీ వైసీపీలో దుమారం రేపింది. ఫోన్ ట్యాపింగ్ గురించి సొంత పార్టీ నేతలే చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అవాస్తవం అని ఆయన అన్నారు. టీడీపీలోకి పోవాలనుకునే వాళ్లే ఇలాంటివి చెబుతారని ఎదురుదాడికి దిగారు. వైసీపీకి నష్టం చేసి టీడీపీలోకి వెళ్లిపోవాలని చూస్తున్నారని బాలినేని ఫైర్ అయ్యారు.

”కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారు. ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. వెళ్లే వారు వెళ్లకుండా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం ఏంటి? ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. శ్రీధర్ రెడ్డిని బతిమిలాడం. పార్టీని వీడినందుకు ఆయన బాధపడక తప్పదు. శ్రీధర్ రెడ్డి స్థానంలో కొత్త ఇంచార్జ్ ను పెడతాం” అని బాలినేని అన్నారు.

Also Read..Andha Pradesh Politics : మా పార్టీవారే మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు..నాకు ప్రాణహాని ఉంది : వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ

కోటంరెడ్డితో మాట్లాడిన వ్యక్తే కాల్ రికార్డ్ చేశాడు. కాల్ రికార్డును ఫోన్ ట్యాపింగ్ అంటారా? అని బాలినేని ప్రశ్నించారు. కోటంరెడ్డి స్నేహితుడే కాల్ రికార్డు చేసి లీక్ చేశాడని బాలినేని ఆరోపించారు. కోటంరెడ్డి సోదరుల మధ్య తాము ఎలాంటి చిచ్చు పెట్టలేదని, ఆ అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ ఇంచార్జి పదవి తనకు ఇవ్వాలని కోటంరెడ్డి సోదరుడు కోరాడని, అయితే కోటంరెడ్డితో ఆ విషయం మాట్లాడుకోవాలని సూచించామని బాలినేని స్పష్టం చేశారు.

మంత్రి పదవి జిల్లాకు ఒకరికే దక్కుతుందని, ఐదారుసార్లు గెలిచిన వాళ్లకు కూడా మంత్రి పదవి దక్కని సందర్భాలు ఉన్నాయని బాలినేని వెల్లడించారు. పదవులు దక్కకుంటే పార్టీపై నిందలు వేస్తారా? అని నిలదీశారాయన.

Also Read..Andhra Paradesh Politics : YCPలో కోటంరెడ్డి కుంపటి..2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ బాంబు పేల్చిన నెల్లూరు నేత

సొంత పార్టీ నేతలే తన ఫోన్ ను ట్రాప్ చేస్తున్నారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలు వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. సమస్య ఏదైనా ఉంటే సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది నిజమే అయితే ఆ విషయాన్ని కోటంరెడ్డి ఎందుకు ప్రభుత్వానికి ముందే చెప్పలేదు? అని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ కోటంరెడ్డి పొరపాటు పడుతుండొచ్చని అన్నారు. ముందు, ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందో, లేదో నిర్ధారణ చేసుకోవాలని హితవు పలికారు. ఏ నేతకైనా తాము ఒకటే చెబుతామని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సీఎం జగన్ వారిపై చర్యలు తీసుకుంటారని తేల్చి చెప్పారు బాలినేని.