గుంటూరు ఫీవర్ ఆస్పత్రిలో కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్..వెయ్యి మంది వాలంటీర్లపై పరీక్షలు

  • Published By: bheemraj ,Published On : November 25, 2020 / 05:08 PM IST
గుంటూరు ఫీవర్ ఆస్పత్రిలో కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్..వెయ్యి మంది వాలంటీర్లపై పరీక్షలు

covaxin clinical trials third phase : ఏపీలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. గుంటూరు ఫీవర్ ఆస్పత్రిలో కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించారు. వెయ్యి మంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహిస్తారు. వెయ్యి కోవాగ్జిన్ కిట్లు ఐసీఎంఆర్ నుంచి గుంటూరుకు చేరుకున్నాయి.



హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ నిర్వహిస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ గుంటూరు జిల్లాలో ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్ లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయి. గుంటూరు, విశాఖలో కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని ఐసీఎంఆర్ భావించింది. దీంట్లో భాగంగానే ఇవాళ గుంటూరులో కోవాగ్జిన్ ప్రయోగాత్మకంగా ప్రయోగించారు.



దాదాపు వెయ్యి మంది వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించనున్నారు. వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందన్న విషయాన్ని ప్రతి నెలా వారిపై ప్రయోగించి తెలుసుకోనున్నారు. ఇది మొత్తం సంవత్సరంపాటు కొనసాగుతోంది. అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణలో పరీక్షలు జరుపనున్నారు.



ఐసీఎంఆర్ నుంచి ఇప్పటికే వెయ్యి కిట్లు గుంటూరుకు చేరుకున్నాయి. రిజల్ట్ ఎలా ఉందన్న దానిపై ప్రతి నెల ఐసీఎంఆర్ కు రిపోర్టు పంపనున్నారు. కాగా సంవత్సరంపాటు ట్రయల్స్ కొనసాగనున్నట్లు చెబుతున్నారు.