Vijayawada Monkeypox : విజయవాడ వాసులకు బిగ్ రిలీఫ్.. అది మంకీపాక్స్ కాదు

దుబాయ్ నుంచి ఇటీవల విజయవాడ వచ్చిన ఓ కుటుంబంలోని రెండేళ్ల చిన్నారికి మంకీపాక్స్ ను పోలిన లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాలికకు మంకీపాక్స్ అయ్యుంటుందన్న అనుమానంతో నమూనాలు సేకరించి, వాటిని పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు.(Vijayawada Monkeypox)

Vijayawada Monkeypox : విజయవాడ వాసులకు బిగ్ రిలీఫ్.. అది మంకీపాక్స్ కాదు

Vijayawada Monkeypox

Vijayawada Monkeypox : విజయవాడ వాసులకు బిగ్ రిలీఫ్ లభించింది. దుబాయ్ నుంచి వచ్చిన వారికి మంకీపాక్స్ లేదని పుణె వైరాలజీ ల్యాబ్ తేల్చింది. దుబాయ్ నుంచి వచ్చిన ఆ కుటుంబానికి ఇతర కాంటాక్టులు నమోదు కాలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించింది. ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. అది మంకీపాక్స్ కాదని డాక్టర్లు నిర్ధారించడంతో టెన్షన్ తొలగింది. బెజవాడ వాసులు రిలాక్స్ అయ్యారు.

దుబాయ్ నుంచి ఇటీవల విజయవాడ వచ్చిన ఓ కుటుంబంలోని రెండేళ్ల చిన్నారికి మంకీపాక్స్ ను పోలిన లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాలికకు మంకీపాక్స్ అయ్యుంటుందన్న అనుమానంతో నమూనాలు సేకరించి, వాటిని పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు.

Monkeypox: ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. అప్రమత్తమైన కేంద్రం

అయితే ఆ చిన్నారికి మంకీపాక్స్ నెగెటివ్ గా వచ్చింది. ఆ బాలికకు మంకీపాక్స్ కాదని డాక్టర్లు నిర్ధారించారు. ఆ బాలికకు చర్మంపై మామూలు దద్దుర్లు వచ్చినట్టు గుర్తించారు. బాలిక కుటుంబం ఇతరులతో కాంటాక్ట్ కాలేదని ఆరోగ్యశాఖ కమిషనర్ వెల్లడించారు.

మంకీపాక్స్.. యావత్ ప్రపంచాన్ని భయపెడుతున్న ఈ వైరల్ వ్యాధి భారత్ నూ వణికిస్తోంది. దేశంలో కేసులు పెరిగే ప్రమాదముందని కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లోనూ మంకీపాక్స్ కలకలం రేపింది. విజయవాడలోకి మంకీపాక్స్ ఎంటరైనట్టు వచ్చిన వార్తలు అలజడి రేపాయి. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే, అది మంకీపాక్స్ కాదని డాక్టర్లు తేల్చడంతో అంతా రిలాక్స్ అయ్యారు.

Monkeypox: మంకీపాక్స్ అంటే ఏమిటి? దానిని ఎలా గుర్తించాలి.. లక్షణాలేంటి..?

సాధారణంగా ఈ మంకీపాక్స్ అనేది స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందిన వైరల్‌ వ్యాధి అని నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధి జంతువుల నుంచి మానవులకు సోకుతుందని.. ముఖ్యంగా ఎలుకలు, చుంచులు, ఉడతలు వంటి జీవుల కారణంగా ఈ వ్యాధి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాగా.. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా జరిపిన పరిశోధనల్లో కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్‌ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

స్మాల్ పాక్స్ లాంటి లక్షణాలే ఉన్నా ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే మంకీపాక్స్ కు గురైన వ్యక్తి.. జ్వరం, తలనొప్పి, వాపు, నడుము నొప్పి, కండరాల నొప్పి, నీరసం వంటి లక్షణాలతో ఉంటారు. ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడి.. రోగి తీవ్ర ఇబ్బందులు పడతారని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది కోలుకుంటారు. కొందరికి మాత్రమే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందంటున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ముఖ్యంగా తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. అయితే శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరుపెట్టారు. ఆ తర్వాత 1970ల్లో తొలిసారి మనుషుల్లో ఇది బయటపడింది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.