పోటీకి పంపండి : గోరంట్ల మాధవ్ కు కోర్టు లైన్ క్లియర్

  • Published By: venkaiahnaidu ,Published On : March 20, 2019 / 12:19 PM IST
పోటీకి పంపండి : గోరంట్ల మాధవ్ కు కోర్టు లైన్ క్లియర్

హిందూపురం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు లైన్ క్లియర్ అయింది. వెంటనే మాధవ్ వీఆర్ఎస్ కు ఆమోదం తెలపాలని ఏపీ సర్కార్ కు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.దీంతో ఆయన వైసీపీ తరపున హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు లైన్‌ క్లియర్‌ అయింది.
Read Also : సుమలత, నిఖిల్ కు ఈసీ షాక్.. సినిమా ప్రసారాలపై నిషేధం

కదిరి సీఐగా ఉన్నసమయంలో మాధవ్ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో ప్రభోధానంద ఆశ్రమ విషయంలో వివాదం ఏర్పడింది.సవాళ్లు,ప్రతి సవాళ్ల  తర్వాత మాధవ్ తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. నెల రోజుల క్రితం వైసీపీలో చేరిన మాధవ్‌ ను ఆ పార్టీ  హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కొన్ని సాంకేతిక కారణాలు ఆయనకు అడ్డు వచ్చాయి. ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసినప్పటికీ దాన్ని ఏపీ ప్రభుత్వం ఆమోదించలేదు.

మాధవ్‌ జనవరి ఆరంభంలో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే వీఆర్‌ఎస్‌ను ఆమోదించడం లేదని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు ఇచ్చినా సరే ఆయనపై రెండు ఛార్జిమెమోలు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు.దీనిపై బుధవారం విచారించిన న్యాయస్థానం మాధవ్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.మాధవ్ వీఆర్ఎస్ కు ఆమోదం తెలపాలని ఏపీ సర్కార్ కు ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చింది.
Read Also : చంద్రబాబు సెటైర్: ఫ్యాన్ ఏపీలో.. స్విచ్ హైదరాబాద్‌లో.. కరెంట్ ఢిల్లీలో