Janasena Janavani : పవన్ జనవాణికి విశేష స్పందన.. భారీగా వచ్చిన బాధితులు

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం సహా వివిధ జిల్లాల నుంచి బాధితులు తరలివచ్చారు. వ్యక్తిగత, సామాజిక సమస్యలు, వారి ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు బాధితులు.

Janasena Janavani : పవన్ జనవాణికి విశేష స్పందన.. భారీగా వచ్చిన బాధితులు

Janasena Janavani

Janasena Janavani : జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, బాధితులు భారీగా వచ్చారని జనసేన నేతలు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి వినతి పత్రాలను తీసుకున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం సహా వివిధ జిల్లాల నుంచి బాధితులు తరలివచ్చారు. వ్యక్తిగత, సామాజిక సమస్యలు, వారి ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లారు బాధితులు. ఇప్పటివరకు 400కు పైగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు పవన్.

పవన్ స్వీకరించిన ఫిర్యాదుల సమాచారాన్ని జనసేన సిబ్బంది కంప్యూటర్ లో నమోదు చేసుకుంటున్నారు. వినతులు, ఫిర్యాదులు అందించిన బాధితులకు జనసేన సిబ్బంది రసీదు అందజేసింది. ఫిర్యాదులను సంబంధిత ప్రభుత్వ విభాగాలకు పంపి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు జనసేన తెలిపింది.

Pawan Kalyan : బీజేపీ ఈ పొజిషన్‌కి రావడానికి 20ఏళ్లు పట్టింది- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే జనవాణి జనసేన భరోసా కార్యక్రమం. ప్రభుత్వ విధానాలపై పోరాటాన్ని పెంచిన జనసేన.. ఇందులో భాగంగా ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుని.. అవి ప్రభుత్వానికి తీసుకెళ్లే ప్రయత్నం చేపట్టింది. అందులో భాగంగా ప్రారంభించిన జనవాని కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. పెద్ద సంఖ్యలో జనం వచ్చి తమ సమస్యలను నేరుగా పవన్ కు చెప్పుకున్నారు.

పాలకులు హామీలు ఇవ్వడం తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తమ అర్జీలతో తరలివచ్చిన ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచి సమస్యలు పరిష్కంచాలన్న ఉద్దేశంతోనే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించామని స్పష్టం చేశారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు పవన్.

Janasena Janavani : ప్రభుత్వాన్ని నిలదీసేలా.. జనసేన కొత్త కార్యక్రమం జనవాణి

పవన్ ఆధ్వర్యంలో జనసేన చేపట్టిన ఈ జనవాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ అనూహ్య స్పందన చూసి జనసేన నేతలే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. అక్కడికి తరలివచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలపై ఆరా తీశారు.

సీఎం‌ నివాసం వద్ద భద్రత పేరుతో ఇల్లు ఖాళీ చేయించారని ఓ మహిళ తనను కలిసిందని పవన్ తెలిపారు. అధికార పార్టీ నేతలు ఆ కుటుంబాన్ని ఎలా వేధించారో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల సోదరుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడని, కూరగాయల కోసం వెళ్లిన ఓ వ్యక్తి శవమయ్యాడని దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు జనసేనాని పవన్.

ఆ మరణానికి ఇప్పటికీ కారణం దొరకలేదు అంటే అధికార వేధింపులు, బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది అన్నారు. ఇలా ఎంతోమంది కుటుంబపరంగా, సామాజికంగా, రాజకీయంగా సమస్యలు సమస్యలు ఎదుర్కొంటున్నా.. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎదురుచూపులు చూస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే తాము నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించడానికే జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని.. ఆ అధికారులు తీసుకునే చర్యలను బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్.