ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఒకేచోట చనిపోయిన కాకులు, గోరింకలు

ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఒకేచోట చనిపోయిన కాకులు, గోరింకలు

Bird flu in Prakasam district, birds Dead in one place : ప్రకాశం జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ భయం నెలకొంది. చిన్న గంజాం మండలం పల్లెపాలంలోని సముద్ర తీర ప్రాంతంలో కాకులు, గోరింకలు చనిపోయాయి. ఐదు కాకులు, మూడు గోరువంకలు ఒకేచోట చనిపోయి ఉండడంతో…అవి బర్డ్‌ ఫ్లూ వల్లే మరణించి ఉంటాయని గ్రామస్థులు భయపడుతున్నారు. గ్రామంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బయటపడిన బర్డ్ ఫ్లూ వైరస్ క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో కోళ్లు, కాకులు, బాతులు, నెమళ్లు ఈ వైరస్ బారిన పడి గురై మృత్యువాతపడుతున్నాయి.

బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. దీంతో వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీలోకి ప్రవేశించింది.