Somu Veerraju On Alliance : బీజేపీ-జనసేన పొత్తు.. సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

మా పొత్తు జనంతో. మా పొత్తు జనసేనతో. మా పొత్తు మరెవరితోనూ కాదు. గ్రామం నుంచి నేషనల్ హైవే దాకా బీజేపీ చేస్తున్న అభివృద్ధి ద్వారా ఏపీలో అధికారంలోకి వస్తాం.

Somu Veerraju On Alliance : బీజేపీ-జనసేన పొత్తు.. సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

Somu Veerraju

Somu Veerraju On Alliance : బీజేపీ-జనసేన పొత్తు, వచ్చే ఎన్నికల్లో పోటీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందని, కలిసి పోటీ చేస్తామని సోము వీర్రాజు చెప్పారు. జనసేనతో తప్ప మరెవరితోనూ పొత్తు ఉండదని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు 2024లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారాయన. అదే సమయంలో టీడీపీ, వైసీపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు.

టీడీపీ, వైసీపీ.. తల్లి, పిల్ల పార్టీలని విమర్శించారు. చంద్రబాబు, జగన్ కుటుంబాలు.. అవినీతిలో కవల పిల్లలు అని అన్నారు. ఇద్దరూ కలిసి పోలవరం ప్రాజెక్ట్ నిధులను దోచుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ సంక్షేమ పథకాల ముందు.. జగన్ కార్యక్రమాలు దిగదిడుపే అన్నారు.(Somu Veerraju On Alliance)

Pawan Kalyan Slams Government : వైసీపీ మళ్లీ వస్తే అంధకారమే-పవన్ కళ్యాణ్

”మా పొత్తు జనంతో. మా పొత్తు జనసేనతో. మా పొత్తు మరెవరితోనూ కాదు. గ్రామం నుంచి నేషనల్ హైవే దాకా బీజేపీ చేస్తున్న అభివృద్ధి ద్వారా ఏపీలో అధికారంలోకి వస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మత్స్యకారులకు రూ.107 కోట్లు ఇచ్చినట్లు జగన్ యాడ్ ఇచ్చారు. అందులో కేంద్ర ప్రభుత్వమే రూ.104 కోట్లు ఇస్తుంది” అని సోము వీర్రాజు తెలిపారు.

Chandrababu : పొత్తులపై చంద్రబాబు కొత్త మాట

రాష్ట్రాన్ని రక్షించాలంటే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని ఓవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలంటున్నారు. పొత్తులను వ్యక్తిగత లాభాల కోణంలో చూడడం లేదని స్పష్టం చేశారు. 2014లో బీజేపీ, టీడీపీలతో కలిసి జనసేన పోటీ చేసిందని గుర్తు చేసిన పవన్.. ఎప్పుడైనా సరే, పొత్తు ప్రజలకు ఉపయోగపడకపోతే జనసేన అందులోంచి బయటికి వస్తుందని తెలిపారు. వైసీపీని ఓడించాలంటే.. టీడీపీని కూడా కలుపుకుపోవాలనే అర్థంలో పవన్ మాట్లాడుతున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా జనసేనతో పొత్తుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

వీరి వెర్షన్ ఇలా ఉంటే.. బీజేపీ నేతల వెర్షన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. జనసేనతో మాత్రమే మా పొత్తు.. మరెవరితోనూ కాదు అని బీజేపీ చీఫ్ సహా కీలక నేతలు తేల్చి చెబుతున్నారు. దీనిపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి రేపుతోంది.

ఇది ఇలా ఉంటే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ, అప్పుడే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఏపీలో పరిస్థితులు చూస్తుంటే త్వరలోనే ఎన్నికలు వస్తాయా? అనే అనుమానం కలగక మానదు. అధికారం, విపక్షం అన్న తేడా లేదు.. అన్ని పార్టీలు ఇప్పటికే జనం బాట పట్టాయి. అధికార వైసీపీ గడప గడపకు ప్రభుత్వం పేరుతో నేరుగా ప్రజల్లోకి వెళ్లింది. అంతేకాదు మంత్రులంతా రెండు రోజులు సచివాలయాల్లో ఉండి.. మిగిలిన ఐదు రోజులు ప్రజల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ఇవన్నీ చూస్తుంటే ముందస్తు ఎన్నికలు తప్పవనే సంకేతాలు అందుతున్నాయి.

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రజల్లోకి వెళ్లారు. బాదుడే బాదుడు పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ఇక నేను సైతం అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తూ ఆదుకుంటున్నారు.