చట్టాలను వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదు – జీవీఎల్

చట్టాలను వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదు – జీవీఎల్

BJP GVL Narasimha Rao : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను (New Farm Laws) వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదని, రైతుల మేలు కోసం చట్టాలు చేయడం జరిగిందని, అప్పుడే చేసి ఉంటే..వీరి పరిస్థితి వేరే విధంగా ఉండేదని బీజీపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (BJP MP GVL) వెల్లడించారు. గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు..కేంద్రంతో చర్చలకు రెడీ చెప్పారు. డిసెంబర్ 29వ తేదీ ఉదయం 11గంటలకు వస్తామని చెప్పాయి రైతు సంఘాలు. మరోవైపు 2020, డిసెంబర్ 27వ తేదీ ఆదివారం గుంటూరు జిల్లా (Guntur Dist) లో బీజేపీ రైతు సాధికారత మహాసభ (Rythu Sadhikaratha Sabha) నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్‌తో 10tv ముచ్చటించింది. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నారని, రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు.

చట్టాలపై ఉన్న అనుమానాలు, ఇబ్బందులను తెలియచేస్తే పరిష్కరిస్తామని ఐదు సార్లు కేంద్రం చెప్పిందన్నారు. వారికి ఉన్న భయం ఎప్పుడో దూరం చేసిందని, ఎంఎస్పీ కొనుగోలు భవిష్యత్ ‌లో ఆగిపోతుందని ప్రచారం జరిగిందని, దీనికి వాస్తవం ఏంటో రైతు సంఘాలకు తెలియచేయడం జరిగిందన్నారు. కొంతమంది అబద్దపు ప్రచారం చేశారని ఆరోపించారాయన. కొనుగోలు దారుడితో జరిగే ఒప్పందం..కేవలం రైతు పండించే పంటపై కానీ..రైతు భూమిపై కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారన్నారు. చట్టం గురించి తెలియని వారు, అబద్దాలు చెబుతున్న వారు, ప్రతిపక్షాలు భయాందోళనలకు గురి చేశారన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేదని, మద్దతు ధర ఉండదని కాంగ్రెస్ పార్టీ అబద్దపు ప్రచారం చేసిందన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.