బీజేపీ-జనసేన పొత్తు ఓటర్లను ఆకర్షిస్తుందా… నేడు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. వైసీపీ, టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 02:08 AM IST
బీజేపీ-జనసేన పొత్తు ఓటర్లను ఆకర్షిస్తుందా… నేడు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. వైసీపీ, టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ – జనసేన పొత్తు ఓటర్లను ఆకర్షిస్తుందా.. జెడ్పీటీసీ, ఎంపీటీసీతోపాటు పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ కూటమికి ఓట్లు పడతాయా.. ఇంతకీ ఇవాళ విడుదల చేయనున్న ఇరుపార్టీల విజన్‌ డాక్యుమెంటరీలో ఏముంది. స్థానిక ఎన్నికల్లో పవన్ , కన్నా ధీమా ఏంటి.. వాచ్‌ దిస్‌ స్టోరీ…

స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీల ఫోకస్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. వైసీపీ, టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య గొడవలు , నేతల మధ్య మాటలయుద్ధం ముదురుతోంది. ఇదే సమయంలో బీజేపీ, జనసేన  కూటమి సైతం స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు రెడీ అయ్యింది.  లోకల్ వార్‌లో తమ అభ్యర్థులను నిలిపి ప్రచార హీట్‌ను పెంచాలని డిసైడ్‌ అయ్యింది.  గ్రామాల్లో బీజేపీ, జనసేనకు బలం లేకపోవడంతో… వారి ఓట్లను ఎలాగైనా రాబట్టుకునేందుకు పంచాయతీలకు వరాలు కురిపించేలా మేనిఫెస్టోను ఈ కూటమి రూపొందించినట్టు తెలుస్తోంది.  ఇవాళ ఇరు పార్టీల నేతలు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

ఏపీకి కేంద్రం చేస్తున్న సాయం వివరాలతో మేనిఫెస్టో!
ఇరుపార్టీలు పలుదఫాలుగా కసరత్తు నిర్వహించి మేనిఫెస్టోను రూపొందించాయి.  బీజేపీ నేతలు  కేంద్రం ప్రభుత్వం ఏపీకి ఏమి ఇస్తుంది… ఎలాంటి పథకాల ద్వారా  రాష్ట్రానికి లబ్ది చేకూరుతుంది అన్నది డాక్యుమెంటరీలో చూపించబోతున్నారు. గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు కేంద్ర పథకాలను తమ పథకాలుగా స్టిక్కర్లు అంటించి ఎలా మోసం చేస్తున్నాయన్నది ఇందులో ప్రధానంగా విరించనున్నారు. 9నెలల వైసీపీ ప్రభుత్వ పాలనలో చేసిన అరాచకాలను ఎండగట్టనున్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్టో రూపొందించినట్టు తెలుస్తోంది.

కేంద్ర పథకాలకు పవన్‌తో ప్రచారం!
రాష్ట్ర ప్రజలకు ఎన్ని విధాలా చెప్పినా బీజేపీని ప్రజలు పట్టించుకోవడం లేదు.  దీంతో ఈ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను పవన్‌తో చెప్పించాలని బీజేపీ నిర్ణయించుకుంది.  ఏపీకి కేంద్రం ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తోందో పవన్‌ నోట చెప్పించి.. ఓటర్లలో సింపతి కొట్టేయాలని భావిస్తోంది. ఇందుకోసం పవన్‌ను జిల్లాల్లో తిప్పుతూ సభల ద్వారా చెప్పించాలా.. లేక పట్టణ, గ్రామాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తూ చెప్పించాలా అన్నదానిపై కసరత్తు చేస్తోంది. ఇవాళ ఇది ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. మొత్తానికి ఇవాళ బీజేపీ, జనసేన విడుదల చేయనున్న మేనిఫెస్టో ఓటర్లను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

See Also | తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు?