Andhra Pradesh-Telangana : ఆంధ్రాకు అన్యాయం చేసి .. ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తుంది? : జీవీఎల్

ఆంధ్రాకు అన్యాయం చేసి .. ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తుంది? అంటూ బీజేపీ నేత జీవీఎల్ మండిపడ్డారు. కేసీఆర్ తో జగన్ కున్న లాలూచీలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh-Telangana : ఆంధ్రాకు అన్యాయం చేసి .. ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తుంది? : జీవీఎల్

Andhra Pradesh-Telangana

Andhra Pradesh-Telangana : టీఆర్ఎస్  (తెలంగాణ రాష్ట్ర సమితి)పార్టీని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్  (భారత్ రాష్ట్ర సమితి)గా మార్చారు. ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తు బీఆర్ఎస్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఏపీతో పాటు దేశమంతా పోటీ చేస్తుందని టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఈక్రమంలో బీజేపీ నేత జీవీఎల్ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు తీరని నష్టం చేసిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి ఆంధ్రాలో ఎలా అడుగుపెడుతుంది? ఏముఖం పెట్టుకుని ఏపీలో పోటీకి సిద్ధపడుతుంది? అంటూ విరుచుకుపడ్డారు. ఆంధ్రా ప్రజలకు టీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ఏపీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు జీవీఎల్. ఆంధ్రాకు తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించాకే బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెట్టాలి అంటూ జీవీఎల్ డిమాండ్ చేశారు.

కేసీఆర్ తో జగన్ లాలూచీపడుతుంటారని అందుకే ఏపీకి రావాల్సిన బకాయిల గురించి కేసీఆర్ ను అడిగే దమ్ము జగన్ కు లేదంటూ విమర్శించారు జీవీఎల్. ఏపీకి తెలంగాణ అన్యాయం చేస్తుంటే అడిగే దమ్ము ధైర్యం అటు జగన్ కు ఇటు చంద్రబాబుకు కూడా లేదా? అంటూ ప్రశ్నించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కేసీఆర్ ను ప్రశ్నించే దమ్ము లేదన్నారు. బీఆర్ఎస్ తో వైసీపీకి లావాదేవీలున్నాయని ఆ లావాదేవీలు ఎటువంటివో చెప్పితీరాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. అన్ని విషయాలపై మాట్లాడే చంద్రబాబు ఈ విషయంపై ఎందుకు మాట్లాడరు? అంటూ ప్రశ్నించారు.  రాజధాని పేరుతో జగన్  డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతి అభివృద్ధి జరగాలన్న చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటారని, మరోవైపు అమరావతిలోనే ఉంటానన్న జగన్ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.