మాణిక్యాలరావుకు కరోనా

  • Published By: madhu ,Published On : July 4, 2020 / 01:23 PM IST
మాణిక్యాలరావుకు కరోనా

నేను ఎవరినీ వదలా అంటోంది కరోనా. ఈ రాకాసి బారిన పడిన వారిలో సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు ఉన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రుల్లోనే..హోం క్వారంటైన్ లో ఉండిపోతున్నారు. ఏ మాత్రం భయపడకుండా స్యయంగా..ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.

వైరస్ కు భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుందని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరస్ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. నేతలకు వైరస్ సోకుతోంది. కొంతమంది నేతలు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు కూడా. తాజాగా ఏపీకి చెందిన మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా సోకింది.

తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్, జీజేపీ నేతకు కరోనా సోకింది. ఆయనతో కారులో మాణిక్యరావు ప్రయాణించారు. ఈ నేపథ్యంలో ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. కరోనా టెస్ట్‌లో తనకు పాజిటివ్‌గా తేలిందని స్వయంగా ఆయనే చెప్పారు. ఈ సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.

కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైరస్ వ్యాపించిందనే విషయాన్ని తానే వెల్లడిస్తున్నాన్నారు. కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా సోకితే ఏమీ కాదని.. కానీ గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని మాణిక్యాల రావు తెలిపారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ధరించడం, ఇతరత్రా పాటిస్తే…కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు.

Read:కర్నూలు జిల్లాలో మరో వజ్రం లభ్యం, గొర్రెల కాపరిని వరించిన అదృష్టం