టీడీపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా ఫెయిల్ : జగన్ తో రహస్య ఒప్పందం లేదు

టీడీపీ, వైసీపీతో పొత్తులు, సంబంధాలపై బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో టీడీపీ, వైసీపీలతో ఎలాంటి పొత్తులు ఉండవని సునీల్ దేవ్ ధర్ స్పష్టం

  • Published By: veegamteam ,Published On : January 16, 2020 / 12:12 PM IST
టీడీపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా ఫెయిల్ : జగన్ తో రహస్య ఒప్పందం లేదు

టీడీపీ, వైసీపీతో పొత్తులు, సంబంధాలపై బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో టీడీపీ, వైసీపీలతో ఎలాంటి పొత్తులు ఉండవని సునీల్ దేవ్ ధర్ స్పష్టం

టీడీపీ, వైసీపీతో పొత్తులు, సంబంధాలపై బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో టీడీపీ, వైసీపీలతో ఎలాంటి పొత్తులు ఉండవని సునీల్ దేవ్ ధర్ స్పష్టం చేశారు. టీడీపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా వారు ఫెయిల్ అవుతారని ఆయన అన్నారు. ఏపీ ప్రజల కోసం జనసేనతో కలిసి పని చేయాలని నిర్ణయించామని దేవ్ ధర్ వెల్లడించారు. బీజేపీ-జనసేన సంయుక్త భేటీ తర్వాత పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు. ఇది చరిత్రాత్మకమైన రోజని సునీల్ అన్నారు.

2024లో సంపూర్ణ మెజార్టీతో బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దేవ్ ధర్ జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చి బంగారు ఆంధ్రప్రదేశ్ ని నిర్మిస్తామన్నారు. మంచి పాలన అందించడంలో చంద్రబాబు, జగన్ విఫలం అయ్యారని దేవ్ ధర్ అన్నారు. ఏపీలో ఎవరితోనూ రహస్య స్నేహాలు, ఒప్పందాలు లేవన్నారు.

రాష్ట్ర ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని… వారి ఆశల మేరకే తమ పొత్తు ఏర్పడిందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చెప్పారు. గురువారం(జనవరి 16,2020) విజయవాడలో సమావేశమైన ఇరు పార్టీల నేతలు.. కలిసి పని చేయాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. తాము అన్ని అంశాలపై చర్చించామని జనసేన, బీజేపీ నేతలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే ఎలాంటి షరతులు లేకుండా కలిసి పని చేయాలని నిర్ణయించామన్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు సునీల్ దేవ్ ధర్. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు తమ పొత్తు కొనసాగుతుందన్నారు.

కుటుంబ, అవినీతి, నిరంకుశ పాలనను ప్రక్షాళన చేసే విధంగా తమ పొత్తు పని చేస్తుందని పవన్ తెలిపారు. రాజధానిపై 5 కోట్ల మంది ప్రజలు పెట్టుకున్న ఆశలను వైసీపీ వమ్ము చేసిందని పవన్ ఆరోపించారు. ఏపీ రక్షణ కోసం తమ కూటమి పని చేస్తుందన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే తమ పొత్తని.. పరస్పర సహకారంతో పని చేస్తామన్నారు. సమన్వయంతో కలిసి పని చేస్తామని.. ప్రతి అంశంపై తాజా భేటీలో చర్చించామన్నారు.

తమ పొత్తును ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు పవన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలోనే కాకుండా.. దేశంలో ఎక్కడ అవసరం ఉందో.. అక్కడ కలిసి పని చేస్తామన్నారు. తమ మధ్య ఓ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని.. ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై చర్చించుకుంటామన్నారు.

సునీల్ దేవ్ ధర్ కామెంట్స్:
* ఇది చరిత్రాత్మకమైన రోజు
* ఏపీ ప్రజల కోసం బీజేపీ-జనసేన కలిసి పని చేస్తాయి
* టీడీపీ-వైసీపీతో పొత్తు ఉండదు
* టీడీపీతో భవిష్యత్తులో ఎలాంటి పొత్తు ఉండదు
* వైసీపీ, టీడీపీతో బీజేపీకి ఎలాంటి అవగాహన లేదు

* 2024లో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
* టీడీపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా ఫెయిల్ అవుతారు
* బంగారు ఏపీని నిర్మిస్తాం
* మంచి పాలన అందించడంలో చంద్రబాబు, జగన్ విఫలం
* ఏపీలో ఎవరితోనూ రహస్య స్నేహాలు, ఒప్పందాలు లేవు
* జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

Also Read : 2024లో అధికారం మాదే : రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీతో కలిశా