GVL On AP Budget : ఏపీ బడ్జెట్.. వైసీపీ మేనిఫెస్టోలా ఉంది- జీవీఎల్

GVL On AP Budget..ఏపీ బడ్జెట్ ను ఉత్తుత్తి బడ్జెట్ గా అభివర్ణించారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులే లేవని చెప్పారు. కొత్త జిల్లాలకు, అమరావతికి కేటాయింపులు ఎక్కడ?

GVL On AP Budget : ఏపీ బడ్జెట్.. వైసీపీ మేనిఫెస్టోలా ఉంది- జీవీఎల్

Gvl On Ap Budget

GVL On AP Budget : ఏపీ బడ్జెట్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీ బడ్జెట్ ను ఉత్తుత్తి బడ్జెట్ గా అభివర్ణించారు. రాష్ట్ర బడ్జెట్ లో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులే లేవని చెప్పారు.

బడ్జెట్ ప్రసంగం జగనన్న స్తుతిలా ఉందన్నారు జీవీఎల్. ఏపీలో అప్పులు 4 లక్షల 39 వేల కోట్లకు చేరాయన్నారు. వడ్డీలకే రాష్ట్ర ఆదాయం సరిపోయేలా ఉందన్నారు. పార్టీ పాంప్లెట్, మేనిఫెస్టోలా బడ్జెట్ ఉందని విమర్శించారు. నవ్యాంధ్ర కలలను నీరుగార్చే పని జగన్ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఎమ్మెల్యే నిధికి ఏడాదికి రూ.2 కోట్లు దేనికి..? అని జీవీఎల్ ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ కి రూ.3500 కోట్లు అంటున్నారు.. గడిచిన మూడేళ్లలో మూడు వందల కోట్లన్నా ఇచ్చారా? అని అడిగారు.(GVL On AP Budget)

కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్లలో టీ తాగేందుకు కూడా డబ్బుల్లేవన్నారు. నిజంగా నిధులివ్వాలనుకుంటే కార్పొరేషన్ ఖాతాల్లో నిధులను వేసి వారి సంక్షేమం కోసం పనిచేసే దమ్ము ఉందా? అని నిలదీశారు. నిధులు ఇవ్వలేకపోతే కార్పొరేషన్లు ఎత్తివేయాలన్నారు. కాకి లెక్కలతో తప్పుడు మాటలను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ఏపీలో కార్పొరేషన్లకు స్వయం ప్రతిపత్తి లేదని జీవీఎల్ అన్నారు.(GVL On AP Budget)

AP Budget 2022-23 : బడ్జెట్‌‌లో బీసీల ఊసేది ? అమ్మ ఒడి అబద్ధం, నాన్న బుడ్డి నిజం

”కరోనా సమయంలో ప్రజలకు ఏపీ ప్రభుత్వం సాయం చేసిందన్నది బూటకం. లేదా వివరాలు బయట పెట్టాలి. అవాస్తవలను బడ్జెట్ ప్రసంగంలో పెట్టారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్ట్ అంశం బడ్జెట్ లో లేదు. బెంగుళూరు హైవేపై నిధులు లేవు. కేంద్రంతో కలసి పని చేయాల్సిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించ లేదు. పెండింగ్ ప్రాజెక్టులపై ప్రతి జిల్లాలో వైసీపీని బీజేపీ నిలదీస్తుంది. అనేక ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. కొత్త జిల్లాలకు, అమరావతికి కేటాయింపులు ఎక్కడ? అమరావతిపై హైకోర్టు తీర్పుకు అనుగుణంగా తీసుకున్న చర్యలు లేవు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండకపోతే బీజేపీ ఊరుకోదు. ప్రతి జిల్లాలో విమానాశ్రయం పెడతామన్నారు. మరి నిధులు ఎక్కడ కేటాయించారు? బడ్జెట్ కేటాయింలు లేకుండా నవ్యాంధ్ర నిర్మాణం ఎలా చేస్తారు? ప్రతి జిల్లాలో వైసిపి నేతలను బీజేపీ నిలదీస్తుంది” అని ఎంపీ జీవీఎల్ అన్నారు.

AP Budget 2022-23 : ఏపీ బడ్జెట్ 2022-23.. పథకాలకు కేటాయింపులు

మార్చి 19న కడప జిల్లాలో బీజేపీ ప్రజాగ్రహ సభ ఉంటుందని జీవీఎల్ తెలిపారు. బడ్జెట్ లో రాయలసీమకు మొండి చేయి సహా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేలా బహిరంగ సభ ఉంటుందన్నారు. రాష్ట్రంలో మానవ వనరులు క్షీణించి పోతున్నాయని జీవీఎల్ అన్నారు. స్కూళ్లు, కాలేజీలను అస్తవ్యస్తంగా తయారు చేశారని వాపోయారు. మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి కూడా లేదన్నారు. నాడు-నేడు పథక నిధులు కేంద్ర ప్రభుత్వానివి అని చెప్పారు. అన్నీ కేంద్రం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటోందని ఆయన ఆరోపించారు.