Andhra Pradesh : వైసీపీ ‘జయహో బీసీ సభ’పై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

విజయవాడలో వైసీపీ నిర్వహించిన బీసీ సభపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం బీసీ సభ నిర్వహించటం హాస్యాస్పదంగా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ కార్పొరేషన్లు పెట్టిన వైసీపీ ప్రభుత్వం వాటికి ఏమాత్రంనిధులు ఇవ్వలేదని అటువంటిది ప్రభుత్వం బీసీ సభ పెట్టి తనపై తానే బురద చల్లుకున్నట్లుగా ఉంది అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ జగన్ ప్రభుత్వాన్ని ఎధ్దేవా చేశారు.

Andhra Pradesh : వైసీపీ ‘జయహో బీసీ సభ’పై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

BJP MP GVL's key comments on BC Sabha organized by YCP government

Andhra Pradesh :  విజయవాడలో వైసీపీ నిర్వహించిన బీసీ జయహో సభపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం బీసీ సభ నిర్వహించటం హాస్యాస్పదంగా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ కార్పొరేషన్లు పెట్టిన వైసీపీ ప్రభుత్వం వాటికి ఏమాత్రంనిధులు ఇవ్వలేదని అటువంటిది ప్రభుత్వం బీసీ సభ పెట్టి తనపై తానే బురద చల్లుకున్నట్లుగా ఉంది అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ జగన్ ప్రభుత్వాన్ని ఎధ్దేవా చేశారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం గొప్ప కాదు వాటికి నిధులు, వనరులు ఇవ్వటం గొప్ప అని మరి బీసీ కార్పొరేషన్ పెట్టిన జగన్ ప్రభుత్వం దానికి ఏం చేసిందని బీసీ సభలు నిర్వహించి గొప్పలు చెప్పుకుంటోంది?అంటూ ప్రశ్నించారు. బీసీలను మోసం చేసి సభలు పెట్టటం గొప్పా? అంటూ ఎద్దేవా చేశారు.

50శాతానికి పైగా ఉన్న బీసీలకు వైసీపీ ఎన్ని సీట్లు ఇచ్చిందో చెప్పాలి అంటూ జీవీఎల్ డిమాండ్ చేశారు. చేనేత, పద్మశాలి,యావులకు అసలు టికెట్లే ఇవ్వలేదని మరి ఏం ఘనకార్యం చేశారని బీసీ సభ పెట్టారు?అంటూ ప్రశ్నించారు. బీసీలకు అలంకారప్రాయమైన పదవులు ఇచ్చి వారినేదో ఉద్ధరించేసినట్లుగా చెప్పుకుంటున్నారని అటువంటి పదవులతో బీసీలకు ఒరిగేదేమీ లేదన్నారు. వైసీపీ పెట్టాల్సింది జయహో బీసీ కాదు.. భయహో బీసీ సభ పెట్టాలి అంటూ ఎద్దేవా చేశారు. నిధులు, వనరులు లేకుండా బీసీ కార్పొరేషన్లు పెట్టి బీసీలను మోసం చేశారని విమర్శించారు. వైసీపీ భయభ్రాంతులకు గురి చేసిన బీసీలకు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే భవిష్యత్‌లో బీసీలు వైసీపీని నమ్మరని జీవీఎల్ తెలిపారు.

జీవీఎల్ వ్యాఖ్యలు ఇలా ఉంటే సభలో జగన్ మాత్రం బీసీలపై ప్రేమ కురిపించేశారు. బీసీలు వెనుకబడ్డ కులాలు కాదు వెన్నెముక కులాలు అంటూ ప్రశంసలు కురిపించేశారు. బీసీలు ఇంటి పునాది నుంచి పైకప్పు వరకు వారే తయారు చేస్తారు అంటూ ఎప్పటిలాగానే రాసి స్కిప్టును పదే పదే చూస్తే పలుకులు వల్లించేశారు. నా పాదయాత్రలో బీసీల కష్టాలను చూశానని బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు,కుట్లు మిషన్లు, షేవింగ్ కిట్లు కాదని బీసీలంటే వెన్నెముకలు అంటూ స్కిప్టు అప్పగించేశారు. యథాఃప్రకారంగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు కురిపించేశారు.చంద్రబాబు బీసీలను మోసం చేశారు అంటూ విమర్శలు సంధించారు.

కాగా వైసీపీ ప్రభుత్వం ఎక్కడ సభలు,సమావేశాలు నిర్వహించినా ఎటువంటి జనాదరణాలేదనే వార్తలు వస్తున్నాయి. బలవంతంగా జనాలను బెదిరించి మరీ సభలకు తరలిస్తున్నా ఫలితం ఉండటంలేదు. సభల్లో జనాలు ఉండలేక గోడలు..గేట్లు దూకి పారిపోతున్న పరిస్థితే ప్రతీ సందర్భంలోను కనిపిస్తోంది. ఈక్రమంలో విజయవాడలో వైసీపీ జయహో బీసీ సభ పరిస్థితి కూడా అదే జరిగిందని సమాచారం. బీసీ జయహో సభను వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ బీసీలు మాత్రం ప్రభుత్వం నిర్వహించిన ఈ బీసీ సభను కూడా పట్టించుకోలేదు. ప్రత్యేకంగా బస్సులు వేసి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ బీసీలు సభకు రావాటానికి ఆసక్తి చూపించనట్లుగా తెలుస్తోంది. సభ ప్రారంభం అయ్యి గంటపైనే గడుస్తున్నా ఇంకా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయని విమర్శలు వచ్చాయి. 85వేలమంది బీసీలతో సభ నిర్వహించాలనే వైసీపీ ప్రభుత్వం యత్నాలు ఫలించలేదు. జనాలు సభకు రాకపోవటంతో సభా ప్రాంగణం అంతా వెలవెలబోయినట్లుగా ఉందని సమాచారం.