జగన్ దావత్ ఇస్తే అయినా కేసీఆర్ మనసు మారుతుందేమో, మూడు రాజధానులు జరిగే పని కాదు

  • Published By: naveen ,Published On : October 26, 2020 / 12:27 PM IST
జగన్ దావత్ ఇస్తే అయినా కేసీఆర్ మనసు మారుతుందేమో, మూడు రాజధానులు జరిగే పని కాదు

tg venkatesh: ఏపీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సహకరిస్తున్నా కొందరు వైసీపీ నేతలు నోరు జారుతున్నారని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇంకా బూచిలా చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ స్టేటస్ జరిగే పని కాదని ఆయన తేల్చారు.




ఇక తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ వివాదంపై టీజీ స్పందించారు. తెలంగాణ.. మిగులు జలాలు వాడుకోవచ్చు.. కానీ, రాయలసీమ వాడుకోవద్దా? ఇదెక్కడి న్యాయం అని టీజీ ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ దావత్ ఇస్తే అయినా తెలంగాణ సీఎం కేసీఆర్ మనసు మారుతుందేమో అని టీజీ కామెంట్ చేశారు. సీఎం కేసీఆర్ రాయలసీమకు సహకరించాలని టీజీ విజ్ఞప్తి చేశారు.


టీజీ కామెంట్స్:
* మూడు రాజధానులు ఇప్పట్లో జరిగే అంశం కాదు
* అనేక రాష్ట్రాల్లో సమ్మర్, వింటర్ కేపిటల్స్ ఉన్నాయి
* ఉత్తరాంధ్ర, రాయలసీమలో సమ్మర్, వింటర్ కేపిటల్స్ ఏర్పాటు చేయాలి
* కంప్యూటర్ పరిజ్ఞానంతో ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చు
* మూడు ప్రాంతాల్లో అసెంబ్లీ సమావేశాలు నడపాలి
* రాయలసీమ హైకోర్టు బెంచ్, మినీ సచివాలయం ఏర్పాటు చేయాలి