Tirupati By Poll : టెంపుల్ సిటీలో పాలిటిక్స్, గురుమూర్తి మతం ఏంటో చెప్పాలంటున్న బీజేపీ

వెంకన్న సన్నిధిలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులు.. ఇప్పటి వరకు కేంద్ర నిధులు, తిరుపతి అభివృద్ధిపైనే దృష్టి సారించారు. ఇక ఇప్పుడు హిందూత్వ కార్డ్‌ను తీసుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Tirupati By Poll : టెంపుల్ సిటీలో పాలిటిక్స్, గురుమూర్తి మతం ఏంటో చెప్పాలంటున్న బీజేపీ

YCP Tirupathi Candidate

Gurumurthy Religion : టెంపుల్‌ సిటీ పాలిటిక్స్‌తో సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ. వెంకన్న సన్నిధిలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులు.. ఇప్పటి వరకు కేంద్ర నిధులు, తిరుపతి అభివృద్ధిపైనే దృష్టి సారించారు. ఇక ఇప్పుడు హిందూత్వ కార్డ్‌ను తీసుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ పాలిటిక్స్‌లో బీజేపీ నేతల కామెంట్స్‌ సరికొత్త హీట్‌ను పుట్టిస్తున్నాయి.

గురుమూర్తి ఏ మతానికి చెందినవారో చెప్పాలంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు బీజేపీ నేత సునీల్‌ దేవధర్‌ డిమాండ్‌ చేశారు. వైసీపీ అభ్యర్థి ఎందుకు తిరుమలకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. అదే సమయంలో వైసీపీ రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘిస్తోందా అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కూడా ట్వీట్‌ చేశారు. ఎస్సీలకు రిజర్వ్‌ అయిన నియోజకవర్గాల్లో కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతానికి చెందిన ఎస్సీలే పోటీ చేయాలని రాజ్యాంగం చెబుతోందని.. మరి వైసీపీ ఈ నిబంధనను ఉల్లంఘిస్తోందా? అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.. ఈ అంశంపై జీవీఎల్‌ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానానికి సంబంధించిన పేపర్లను కూడా జత చేశారు..

ఇప్పటికే సొంత క్యాడర్‌ తో పాటు పవన్‌ చరిష్మాను కూడా తమ గెలుపుకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్న కమళనాథులు.. టెంపుల్‌ సిటీలో హిందూత్వ కార్డ్‌ను కూడా ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. దీనికి అనుగుణంగానే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది హిందూత్వ కార్డును తెరపైకి బలంగా తీసుకొస్తున్నారు.. హోంమంత్రి సుచరిత, తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి క్రిస్టియన్లే అని ప్రచారం చేస్తున్నారు.. సీఎం జగన్‌ పాలనలో మత మార్పిళ్లు పెరిగాయంటూ విమర్శిస్తున్నారు. మరి ఈ హిందూత్వ కార్డు తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలతో ఓట్లు కురిపిస్తుందా? బీజేపీని గెలిపిస్తుందా? అన్నది వేచి చూడాలి.