Black Tickets: ఇకపై ఏ రోజైనా సినిమా టిక్కెట్ ఒకే ధరకి..

సినిమా ఎంటర్‌టైన్మెంట్ కోసం పేదల నుంచి ధనికుల వరకు ఆసక్తి చూపుతున్నారనేది కాదనలేని వాస్తవం. తమ అభిమాన నటుడి..

Black Tickets: ఇకపై ఏ రోజైనా సినిమా టిక్కెట్ ఒకే ధరకి..

Balck Tickets

Black TIckets: సినిమా ఎంటర్‌టైన్మెంట్ కోసం పేదల నుంచి ధనికుల వరకు ఆసక్తి చూపుతున్నారనేది కాదనలేని వాస్తవం. తమ అభిమాన నటుడి సినిమాను ఫస్ట్ రోజే చూసేయాలనే ఉత్సాహం చాలా మందిలో ఉంటుంది. ఈ అభిమానాన్ని వీలు ఉన్నంత వరకు సొమ్ము చేసుకోవాలనే అత్యాశ ఎంతో మంది పేదల జేబులకు చిల్లు పొడుస్తోంది.

ఏ సినిమా అయినా ఒక్కటే.. సినిమాను సినిమాగానే చూడాలి. సినిమాలో ఎవరు ఉన్నా.. ఏ రోజైనా.. టికెట్‌ ధర మాత్రం ఒకటే ఉండాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్దేశం. తొలి రోజైనా, తొలి మూడు రోజులైనా.. నాలుగో రోజైనా వేసేది అదే సినిమా. అలాంటప్పుడు తొలి మూడు రోజులూ టికెట్ల ధరలు పెంచటం ఎందుకు అనే సగటు ప్రేక్షకుడి ప్రశ్నపై ప్రభుత్వం ప్రభుత్వం ఏకీభవించింది.

ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశామని, నటీనటులకు ఎక్కువ పారితోషికం ఇచ్చామని.. తదితర కారణాలతో టికెట్ల రేట్లు పెంచుతామంటే ఇకపై కుదరదని స్పష్టం చేసింది.

ప్రాంతాల వారీగా టికెట్ల ధర
తమ అభిమాన హీరో సినిమా అనో.. లేక పేరున్న దర్శకుడి సినిమా అనో రిలీజైన తొలి రోజో, తర్వాతి రోజో చూడాలనుకుంటారు. ఆ బలహీనతను సొమ్ము చేసుకోవటానికి ఆ రెండుమూడ్రోజులూ కొన్ని సినిమాల రేట్లను నాలుగైదు రెట్లు పెంచేయటమనేది అభిమానుల ఆక్రోశం కూడా. కాకపోతే ఎలాగైనా ఆ రోజే చూడాలనే ఉద్దేశంతో డబ్బులు ఎంత వెచ్చించడానికైనా వెనకాడటం లేదు.

ఈ అధికారిక బ్లాక్‌ను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఇలా ప్రాంతాల వారీగా టికెట్లకు ధరలు నిర్దేశించింది. ఇవన్నీ సినిమాలకూ… అన్ని రోజులూ అమలవుతాయని స్పష్టం చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఇకపై కొత్త సినిమాలకు అదనపు బాదుడు ఉండదనేది పెద్ద ఉపశమనం కలిగించిందని వారి భావన. ప్రతి సినిమా హాల్ తగినంత పార్కింగ్‌ ప్రాంతాన్ని కేటాయించాలని, సహేతుక పార్కింగ్‌ ధరలను వసూలు చేయాలని, థియేటర్‌ క్యాంటీన్లలో విక్రయించే వస్తువులు కూడా వాటిపై ఉండే గరిష్ట చిల్లర ధరకు మించి విక్రయించకూడదని స్పష్టం చేసింది. రూల్స్ ఉల్లంఘిస్తే ఆయా థియేటర్ల యాజమాన్యాలే బాధ్యత వహించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.