Bonda Uma: కొడాలి నానిపై బోండా ఉమ ఫైర్.. క్యాసినోపై చర్యలు తీసుకోకపోతే హైకోర్టుకు!

గుడివాడలో క్యాసినో ఆడినట్లుగా వచ్చిన ఆరోపణల నేపధ్యంలో మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bonda Uma: కొడాలి నానిపై బోండా ఉమ ఫైర్.. క్యాసినోపై చర్యలు తీసుకోకపోతే హైకోర్టుకు!

Bonda Uma

Bonda Uma: గుడివాడలో క్యాసినో ఆడినట్లుగా వచ్చిన ఆరోపణల నేపధ్యంలో మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఇప్పుడు ఆ ఇష్యూ కొడాలి నాని వర్సెస్ టీడీపీ నేతలుగా మారి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. గుడివాడ కే కన్వెన్షన్‌‌లోనే క్యాసినో తనది కాదని, అది తనదేనని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగలెట్టుకుంటానంటూ కొడాలి నాని సవాల్ చేశారు.

కొడాలి నాని చేసిన సవాల్‌పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ స్పందించారు. ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని సవాల్‌కు సై అన్నారు. కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్‌‌లోనే క్యాసినో నిర్వహించారని, తమ ఆరోపణలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పుకొచ్చారు.

గుడివాడ క్యాసినోపై ఆధారాలు ఉన్నాయని చెప్పిన బోండా ఉమ.. తామే పెట్రోల్ డబ్బా తెస్తామని కూడా అన్నారు. తాము చేసిన ఆరోపణలను నిరూపించుకోలేకపోతే తామే తగులబెట్టుకుంటామన్నారు. తాము నిరూపిస్తే మాత్రం కొడాలి నాని తగులబెట్టుకోవాలని అన్నారు.

రాష్ట్రంలో ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ అమలు కావట్లేదని, సీఎం చెప్పేదానికి చేసేపనికి సంబంధం ఉండట్లేదన్నారు. తాడేపల్లి నుంచి వచ్చిన సూచనలనే పోలీసులు పాటిస్తున్నారని చెప్పారు బోండా ఉమ.

కొడాలి నాని నిర్వహించే క్యాసినోకు స్థానిక పోలీసులే బందోబస్తుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు ఇచ్చే ఫిర్యాదులను తీసుకోవడానికి అధికారులు సిద్ధంగా లేరని, పోలీసులు క్యాసినోపై చర్యలు తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్తామన్నారు.