అమరావతిపై లక్ష కోట్ల పెట్టుబడి పెట్టడం రిస్క్ : బోస్టన్ గ్రూప్

రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జగన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 03:20 PM IST
అమరావతిపై లక్ష కోట్ల పెట్టుబడి పెట్టడం రిస్క్ : బోస్టన్ గ్రూప్

రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జగన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.

రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జగన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. బోస్టన్ కమిటీ ఏపీలోని వివిధ  ప్రాంతాల్లో పర్యటించిందని తెలిపారు. అభివృద్ధికి చేపట్టాల్సిన విధానాలను నివేదికలో సూచించిందన్నారు. 13 జిల్లాలను 6 రీజియన్లుగా బోస్టన్ గ్రూప్ పరిశీలించిందన్నారు. రాష్ట్రంలోని 7 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని  చెప్పారు. ఏపీకి 2.25లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు.

రాజధాని అమరావతి నిర్మాణంపై బోస్టన్ కమిటీ గ్రూప్ కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతిపై పెట్టుబడి పెట్టడం రిస్క్ తో కూడుకున్నదని చెప్పింది. పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంది. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష కోట్లు అవసరం అవుతాయని బోస్టన్ గ్రూప్ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రం 2.25లక్షల కోట్ల అప్పుల్లో ఉంది.. ఈ పరిస్థితుల్లో అమరావతిపై లక్ష కోట్ల పెట్టుబడి అవసరమా? అని బోస్టన్ గ్రూప్ ప్రశ్నించింది. లక్షా 10వేల కోట్లు ఒకే నగరంపై పెట్టడం ఎంత వరకు సమంజసం అని అడిగింది. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే అమరావతి నిర్మాణం ఆర్థిక భారంతో కూడుకున్నదన్నారు. అసలు ప్రభుత్వం దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయా అని అడిగారు.

అమరావతిపై పెట్టే పెట్టుబడులను నీటి పారుదల రంగంపై పెడితే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని, ప్రాంతీయ అసమానతలు తొలగుతాయని బోస్టన్ గ్రూప్ కమిటీ తన నివేదికలో తెలిపింది. అమరావతిపై అంత పెట్టుబడి పెట్టినా.. దాని ద్వారా వచ్చే ఆదాయం అప్పులు తీర్చడానికే సరిపోతుందన్నారు. అమరావతిపై అంత డబ్బు పెట్టేకంటే.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెట్టడం మంచిదన్నారు. అమరావతి రాజధానికి రుణం తెస్తే.. ఏటా రూ.10వేల కోట్లు వడ్డీ రూపంలో కట్టాల్సి ఉంటుందన్నారు.

బోస్టన్ గ్రూప్ నివేదికలోని సూచనలు:
* ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిని అభివృద్ది చేయాలంటే రూ.లక్ష కోట్లు అవసరమవుతాయి
* 25 ఏళ్లలో అమరావతి 16 శాతం అభివృద్ది అవుతుందని అంచనా
* సిటీలు, కేపిటల్ ను ఎలా అభివృద్ధి చేయాలో ప్రణాళిక
* అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చును ఇరిగేషన్ లో పెడితే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది
* అమరావతిలో పెట్టుబడి పెట్టినా ఆదాయం ఆర్జించడానికి 40 ఏళ్లు పడుతుంది
* అమరావతిపై పెట్టేకంటే ఆ డబ్బును అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పెడితే మంచిది
* అమరావతిపై వచ్చే ఆదాయం అప్పులు తీర్చడానికే సరిపోతుంది

* అమరావతి రాజధానికి రుణం తెస్తే.. ఏటా రూ.10వేల కోట్లు వడ్డీ కట్టాలి
* అమరావతిలోని భూముల అమ్మకాల ద్వారా వచ్చే నిధులు సరిపోవు
* లక్షా 10వేల కోట్లు ఒకే నగరంపై పెట్టడం అవసరమా
* పెట్టుబడి – రాబడి కోణంలో చూస్తే అమరావతి నిర్మాణం ఆర్థిక భారం
* అసలు ప్రభుత్వం దగ్గర లక్ష కోట్లు ఉన్నాయా
* ఇప్పటికే 2.5లక్షల కోట్లు అప్పున్న రాష్ట్రానికి అంత పెట్బుబడి అవసరమా?
* శాసనసభకు విజయవాడ మొదటి ప్రాధాన్యత.. రెండో ప్రాధాన్యత విశాఖ
* బెంగళూరుకు ప్రత్యామ్నాయంగా అనంతపురాన్ని, హైదరాబాద్ కు ప్రత్యామ్నాయంగా కర్నూల్ ని అభివృద్ధి చేయాలి

Also Read : విశాఖ బెస్ట్ : రాజధానిపై బోస్టన్ గ్రూప్ రెండు ఆప్షన్లు