Peetadhipathi : బ్రహ్మంగారి మఠం వివాదానికి ఫుల్ స్టాప్

కడప జిల్లాలో ఉన్న బ్రహ్మంగారి మఠం వివాదానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. మఠాధిపతిగా దివంగత పీఠాధిపతి మొదటి భార్య కుమారుడు వెంకటాద్రిస్వామిని ఎంపిక చేశారు. అలాగే..రెండో భార్య కుమారుడు వీరభద్రయ్యను ఉత్తరాధికారిగా ఎంపిక చేసి ఈ వివాదానికి తెరదించారు.

Peetadhipathi : బ్రహ్మంగారి మఠం వివాదానికి ఫుల్ స్టాప్

Brahmamgari

Brahmamgari Matam : కడప జిల్లాలో ఉన్న బ్రహ్మంగారి మఠం వివాదానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. మఠాధిపతిగా దివంగత పీఠాధిపతి మొదటి భార్య కుమారుడు వెంకటాద్రిస్వామిని ఎంపిక చేశారు. అలాగే..రెండో భార్య కుమారుడు వీరభద్రయ్యను ఉత్తరాధికారిగా ఎంపిక చేసి ఈ వివాదానికి తెరదించారు. తదనంతరం మఠాధిపతిగా రెండో భార్య మహాలక్ష్మమ్మ కుమారుడికి ఛాన్స్ వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కందిమల్లయ్యపల్లి సంస్థానం పుర ప్రజల సహకారంతో పీఠాధిపతి ఎంపిక జరిగింది.

గ్రామస్థులు, ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలం కావడంతో ఇప్పటి వరకు ఉన్న సందిగ్ధత తొలగిపోయింది. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగాయని, ఇవి సఫలం అయినట్లు..స్థానికంగా ఉన్న వారు వెల్లడించారు.