Brahmamgari Matham : బ్రహ్మంగారి మఠం వివాదం, మేనేజర్‌‌పై చర్యలు తీసుకోవాలి – గ్రామస్తులు

బ్రహ్మంగారి మఠం వివాదం మళ్లీ మొదటికొచ్చింది. పీఠాధిపతులు, మహాలక్ష్మమ్మ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో గ్రామస్తులు పలు ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రహ్మంగారి మఠంలో సమస్యలకు కారణం అయిన మేనేజర్‌‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు.

Brahmamgari Matham : బ్రహ్మంగారి మఠం వివాదం, మేనేజర్‌‌పై చర్యలు తీసుకోవాలి – గ్రామస్తులు

Kadapa Brahmamgari Matham

Brahmamgari Matham : బ్రహ్మంగారి మఠం వివాదం మళ్లీ మొదటికొచ్చింది. పీఠాధిపతులు, మహాలక్ష్మమ్మ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో గ్రామస్తులు పలు ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రహ్మంగారి మఠంలో సమస్యలకు కారణం అయిన మేనేజర్‌‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు.

బ్రహ్మంగారి మఠం ప్రతిష్టకు భంగం కలిగిస్తే తాము చూస్తూ ఊరుకోమని, తదుపరి పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి నియమించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చదువుకున్న వ్యక్తి..అంతేగాకుండా..యోగ్యుడు కనుక ఆయనే పీఠాధిపతి స్థానానికి అర్హుడని వారు వెల్లడిస్తున్నారు. అలా కాకుండా మరెవరినో పీఠాధిపతిని చేస్తామంటే తాము చూస్తూ ఊరుకోమని గ్రామస్తులు హెచ్చరించడం గమనార్హం.

మరోవైపు…
బ్రహ్మంగారిమఠం పీఠాధిపత్యం వ్యవహారం చిలికి చిలికి గాలివాన మారుతోంది. శైవక్షేత్ర పీఠాధిపతి శివయ్య స్వామితో పాటు మరి కొందరు దివంగత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి మెదటి భార్య కుమారునికి పీఠాధిపత్యం అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివయ్య స్వామి వాదనను విశ్వబ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మారుతీ మహాలక్ష్మి కుమారుడు గోవింద స్వామికే పీఠాధిపత్యం అప్పగించాలని విశ్వబ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో 12 మంది మఠాధిపతులు ఈ సమస్య పరిష్కారం కోసం బ్రహ్మంగారి మఠంలో పర్యటించారు. అక్కడ స్థానికులు, బ్రహ్మంగారి వారసులతో చర్చించారు. అయితే ఇప్పటికీ ఆ సమస్య కొలిక్కి రాలేదు. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. దీంతో మరోసారి మఠంలో పర్యటించనున్నారు 20 మంది వివిధ మఠాధిపతులు. పీఠాధిపతులు వెళ్తారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.

Read More : Buchi Babu : ఎన్టీఆర్ – బన్నీతో సినిమా ఎప్పుడు..?