AP High Court : బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక, హైకోర్టులో విచారణ

బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక ఓ కొలిక్కి రావడం లేదు. హైకోర్టులో మఠాధిపతి రెండో భార్య పిటిషన్ దాఖలు చేయడంతో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. బ్రహంగారి మఠానికి శాశ్వత, తాత్కాలిక  మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి పిటిషన్ లో పేర్కొన్నారు.

AP High Court : బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక, హైకోర్టులో విచారణ

Ap High Court

Brahmamgari Peetadhipathi : బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక ఓ కొలిక్కి రావడం లేదు. హైకోర్టులో మఠాధిపతి రెండో భార్య పిటిషన్ దాఖలు చేయడంతో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. బ్రహంగారి మఠానికి శాశ్వత, తాత్కాలిక  మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. మఠానికి స్పెషల్ ఆఫీసర్ ను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు. మఠంపై నిర్ణయాలను ధార్మిక పరిషత్ తీసుకోవాలని వెల్లడించారు.

దీనిపై కోర్టు స్పందించింది. ధార్మిక పరిషత్ అనుమతించిందా అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. పూర్తి వివరాలతో సోమవారం నాటికి అఫిడవిడ్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం సోమవారానికి విచారణను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

మరోవైపు ముగ్గురు కుటుంబ సభ్యుల మధ్య స్థానిక ఎమ్మెల్యే సయోధ్యను కుదిర్చిన సంగతి తెలిసిందే. పీఠాధిపతి ఎంపిక విషయంలో హైకోర్టులో కేసు మారుతి మహాలక్ష్మమ్మ కేసు వేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మేనేజర్ ఈశ్వరాచారేదనని, అవినీతి అక్రమాలకు పాల్పడిన మేనేజర్ ఈశ్వరాచారిపై ఇంతవరకు విచారణ చేయకపోవడంపై ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. ఇతనిపై వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.