Brahmam Gari Peetadhipathi : బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక, మహాలక్ష్మమ్మ ఎక్కడ ?

బ్రహ్మంగారి మఠం ఎంపిక వివాదం ఇంకా సమసిపోలేదు. పలు దఫాలుగా చర్చలు జరిగినా...సఫలం కాలేదు. రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ తనకు మఠాధిపతం ఇవ్వాల్సిందేనంటు పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే...పోలీసులకే బురిడీ కొట్టి అర్ధరాత్రి 12 గంటలకు మారుతి మహాలక్ష్మమ్మ వెళ్లిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

Brahmam Gari Peetadhipathi : బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక, మహాలక్ష్మమ్మ ఎక్కడ ?

Brahmam

Brahmam Gari Peetadhipathi : బ్రహ్మంగారి మఠం ఎంపిక వివాదం ఇంకా సమసిపోలేదు. పలు దఫాలుగా చర్చలు జరిగినా…సఫలం కాలేదు. రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ తనకు మఠాధిపతం ఇవ్వాల్సిందేనంటు పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే…పోలీసులకే బురిడీ కొట్టి అర్ధరాత్రి 12 గంటలకు మారుతి మహాలక్ష్మమ్మ వెళ్లిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

తమ బంధువులకు బాగాలేదని చెప్పి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే..ఏడు బ్యాగులు, డబ్బు, బంగారం తీసుకెళ్లినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. వెంటనే మారుతి మహాలక్ష్మమ్మ పై కేసు నమోదు చేసి విచారణ జరపాలని కందిమల్లయ్య పల్లె ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే రఘురాం రెడ్డి పంచాయతీ చేసిన తర్వాత.. ఆ రాత్రికి రాత్రే మారుతి మహాలక్ష్మమ్మ వెళ్లిపోవడం గమనార్హం.

ముగ్గురు కుటుంబ సభ్యుల మధ్య స్థానిక ఎమ్మెల్యే సయోధ్యను కుదిర్చారు. పీఠాధిపతి ఎంపిక విషయంలో హైకోర్టులో కేసు మారుతి మహాలక్ష్మమ్మ కేసు వేశారు. దీంతో ఉన్న గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మేనేజర్ ఈశ్వరాచారేదనని, అవినీతి అక్రమాలకు పాల్పడిన మేనేజర్ ఈశ్వరాచారిపై ఇంతవరకు విచారణ చేయకపోవడంపై ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. ఇతనిపై వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే రఘురాం రెడ్డిని గ్రామస్థులు కలిసి ఫిర్యాదు చేయనున్నారు.