Breaking : ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు స్టే

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Breaking : ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు స్టే

Breaking

Highcourt stays parishad elections : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి పరిషత్ ఎన్నికలపై స్టే ఇచ్చింది హైకోర్టు. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఉత్తర్వులు ఇచ్చింది.

టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీం కోర్ట్ నిబంధనల మేరకు కోడ్ విధించలేదన్న హైకోర్ట్.. ఈ వ్యాఖ్యలు చేసింది. టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్టే విధించింది.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కోడ్‌ విధించలేదని హైకోర్టు ఆక్షేపించింది. తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.

ఇదిలావుంటే నీలం సాహ్ని.. ఏపీ ఎస్ఈసీగా గురువారం (ఏప్రిల్ 1, 2021) బాధ్యతలు తీసుకున్న రోజే… జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం (ఏప్రిల్ 8, 2021) పోలింగ్, ఏప్రిల్ 10న ఫలితాలు వెల్లడించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.