కరోనా వచ్చిన ఫరవాలేదు..మందు మాత్రం కావాలె..మద్యం కోసం మందుబాబులపాట్లు

  • Published By: nagamani ,Published On : June 25, 2020 / 10:23 AM IST
కరోనా వచ్చిన ఫరవాలేదు..మందు మాత్రం కావాలె..మద్యం కోసం మందుబాబులపాట్లు

విశాఖపట్నం జిల్లాలో గిరిజనులు కరోనా భయంతో స్వచ్ఛంధంగా లాక్ డౌన్ పాటిస్తుంటే నెల్లూరు జిల్లాలో మందు బాబులు మాత్రం మాకు కరోనా వచ్చినా పరవాలేదు..మాకు మద్యమే కావాలంటూ మద్యం షాపులకు ఎగబడుతున్నారు. 

ఏమాత్రం నిబంధనలు పాటించకుండా మద్యం సీసాల కోసం షాపుల వద్ద కిలోమీటర్ల కొద్దీ లైన్లలో నిలబడుతున్నారు. ఒక్క మద్యం బాటిల్ దొరికినా చాలు..మాకు ఈరోజు పండగేరా బాబూ అంటే ఏదో సాధించినవారిలా మద్యం బాటిల్ పట్టుకుని పరుగెడుతున్నారు. 

లైన్లలో నిలబడే సమయంలో అస్సలు ఏమాత్రం భౌతిక దూరం అనే మాటేలేదు. ముఖాలకు మాస్కులు కూడా కట్టుకోకుండా మద్యం షాపుల దగ్గర ఒకరిమీద మరొకరు పడిపోతూ..మద్యం బాటిల్స్ దక్కించుకోవటానికి పోటీ పడుతున్నారు మందుబాబులు. 

కాగా నెల్లూరు జిల్లాలో  దాదాపు 250 కరోనా కేసులు నమోదైనా మందుబాబులు ఏమాత్రం భయపడట్లేదు. జిల్లాలోని నాయుడుపేట, పెళ్లకూరు వంటి మండలాల్లో మద్యంప్రియులు ఉదయం 7 గంటల నుంచే మద్యం దుకాణాల వద్ద క్యూలు కట్టారు. షాపు ఎప్పుడు తీస్తారా అని వేయి కళ్లతో ఎదురు చూస్తూ..షాపు ఇలా తెరవంగానే అలా ఒకరిమీద మరొకరు పడుతు మద్యం బాటిల్స్ కోసం ఎగబడుతున్నారు. 

Read: స్వచ్ఛంధ లాక్ డౌన్ పాటిస్తున్న గిరిజనులు..విశాఖ ఏజెన్సీలో మ.1గంట వరకే షాపులు