కరోనా ఎఫెక్ట్ : ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా

  • Published By: madhu ,Published On : March 20, 2020 / 08:34 AM IST
కరోనా ఎఫెక్ట్ : ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా

ఏపీ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడింది. స్థానిక ఎన్నికలను పోస్ట్ పోన్డ్ చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి..ఎన్నికల కోడ్ ఉండడంతో ఇళ్ల పట్టాల పంపిణీ చేయవద్దని సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డంకులు తొలిగాయి. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేయాలని ప్రభుత్వం భావించింది. 

See Also | కరోనా సాకుతో ధరలు పెంచినా..తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు – సీఎం జగన్

2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై ఆరా తీశారు. నిరుపేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అంబేద్కర్ జయంతి అంటే..ఏప్రిల్ 14న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపడుతున్నందున పోస్టుపోన్డ్ చేయాలని సీఎం జగన్ సూచించారు. లబ్ధి దారులు అందర్నీ ఒకేసారి రాకుండా..సోషల్‌ డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేస్తూ, జాగ్రత్తలు తీసుకుని వారికి సైట్లను చూపించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. 

పేదింటి వారి సొంతింటి కలను సాకారం చేయాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇళ్ల పట్టాలను మహిళల పేరిట పంపిణీ చేయనున్నారు. భూమి లభ్యత లేని చోట కొనుగోలు చేస్తారు. ఇంటి పట్టా ఇవ్వడమే కాకుండా..స్థలం ఎక్కడుందో లబ్దిదారులకు స్పష్టంగా చూపించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ..ఉగాది రోజున కాకుండా..అంబేద్కర్ జయంతి రోజున ఇళ్ల పట్టాల పంపిణీ జరుగనుంది. 

Read More : కరోనా సాకుతో ధరలు పెంచినా..తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు – సీఎం జగన్