Road Accident Bride Died : తెల్లారితే పెళ్లి..తల్లి చూస్తుండగా రోడ్డు ప్రమాదంలో వధువు మృతి

పల్నాడు జిల్లాలో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. తెల్లారితే పెళ్లి.. అంతలోనే వధువు అనంతలోకాలకు వెళ్లింది. మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువును మృత్యువు కబలించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ హృదయవిదారక సంఘటన చిలకలూరిపేటలో చోటు చేసుకుంది.

Road Accident Bride Died : తెల్లారితే పెళ్లి..తల్లి చూస్తుండగా రోడ్డు ప్రమాదంలో వధువు మృతి

Accident in Karnataka

Road Accident Bride Died : పల్నాడు జిల్లాలో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. తెల్లారితే పెళ్లి.. అంతలోనే వధువు అనంతలోకాలకు వెళ్లింది. మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువును మృత్యువు కబలించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ హృదయవిదారక సంఘటన చిలకలూరిపేటలో చోటు చేసుకుంది.

తన కళ్ల ముందే కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో తల్లి మూర్చపోయింది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెల్లిన తల్లిని చికిత్స నిమిత్తం గుంటూరు ఆస్పత్రికి పోలీసులు తరలించారు. పెండ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగడంతో చిలకలూరిపేటలోని వారి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Road Accident : ఎస్‌ఐ పరీక్ష రాసి, తమ్ముడి పెళ్లికి వెళ్తుండగా విషాదం – రోడ్డు ప్రమాదంలో అన్న మృతి

చిలకలూరిపేటకు చెందిన రాచుమల్లు సాయిలక్ష్మీ డిగ్రీ పూర్తి చేసి.. స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధార్‌ సెంటర్‌లో ఉద్యోగం చేస్తోంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన వ్యక్తితో సాయిలక్ష్మి వివాహం నిశ్చయమైంది. బుధవారం రాత్రి వీరి పెళ్లి జరుగనుంది. మంగళవారం సాయంత్రం తల్లితో కలిసి మొక్కు తీర్చుకునేందుకు బోయపాలెం పార్వతీదేవి ఆలయానికి స్కూటీపై సాయిలక్ష్మి బయల్దేరింది.

ఈ క్రమంలో యడ్లపాడు సమీపంలోని సుబాబుల్‌ తోట దగ్గర స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ప్రైవేట్‌ బస్సును ఢీకొట్టింది. సాయిలక్ష్మి బస్సు-స్కూటీ మధ్య ఇరుక్కుపోయింది. దీంతో సాయిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. స్కూటీ వెనక కూర్చున్న తల్లి నాగలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. తన కళ్ల ముందే కుమార్తె ప్రాణాలు కోల్పోవడాన్ని చూసిన నాగలక్ష్మి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు పోలీసులు మృతి

సమాచారం తెలుసుకున్న యడ్లపాడు పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. బస్సు-స్కూటీ మధ్య ఇరుక్కుపోయిన సాయిలక్ష్మిని క్రేన్‌ సాయంతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన తల్లి నాగలక్ష్మిని చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించారు. రోడ్డుపై పారేసిన దిష్టి తీసిన కొబ్బరికాయను తప్పించే క్రమంలో స్కూటీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టినట్లుగా అనుమానిస్తున్నారు. సాయిలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.