Pet Love : కుక్కకు కాంస్య విగ్రహం, 5వ వర్ధంతి..ప్రత్యేక పూజలు, ఎక్కడంటే

తన పెంపుడు జంతువుకు ఏకంగా కాంస్య విగ్రహం పెట్టించి...దాని వర్ధంతి రోజున పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Pet Love : కుక్కకు కాంస్య విగ్రహం, 5వ వర్ధంతి..ప్రత్యేక పూజలు, ఎక్కడంటే

Dog

Bronze Statue Dog : జంతువులంటే కొంతమందికి చాలా ప్రేమ. వాటిని కంటికి రెప్పలా చూసుకుంటుంటారు. వాటికి ఏమైనా జరిగితే సొంతవాళ్లకు జరిగినట్లుగా ఫీలవుతుంటారు. అవి తిరిగి ఆరోగ్యంగా అయ్యేంత వరకు ఆందోళన చెందుతుంటారు. కానీ..భూమీ మీద ఉన్న ఏ జంతువైనా..మనిషైనా కాలం చేయాల్సిందే. జంతువులు చనిపోయినప్పుడు వారు పడే బాధ వర్ణనాతీతం. కన్నీళ్లు కారుస్తూ..వాటి అంత్యక్రియలను ఘనంగా నిర్వహిస్తుంటారు కొందరు.

Read More : Mansadevi Temple : బిల్వపర్వత శిఖరంపై కొలువైన మానసాదేవి

మరికొందరు..ఒక అడుగు ముందుకేసి..వాటి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అయితే..ఓ వ్యక్తి మాత్రం తన పెంపుడు జంతువుకు ఏకంగా కాంస్య విగ్రహం పెట్టించి…దాని వర్ధంతి రోజున పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన సుంకర జ్ఞానప్రకాశ రావు ఓ కుక్కను పెంచుకుంటున్నారు. ఇతనికి ఆ కుక్క అంటే ఎంతో ప్రేమ. దానికి ‘శునకరాజు’ అని పేరు కూడా పెట్టారు.

Read More : Rare Treatment : 23 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన చేతులు.. కుటుంబ సభ్యులను కౌగిలించుకోబోతున్న వ్యక్తి

Dog Ap

కుటుంబసభ్యుల కంటే ఎక్కువగా చూసుకున్నారు. అయితే..కొంతకాలం తర్వాత ఆ శునకరాజు చనిపోయింది. లోకం విడిచి వెళ్లిపోయినా..దాని జ్ఞాపకాల్లో జీవిస్తున్నారు. ప్రతి సంవత్సరం దాని వర్ధంతి కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహిస్తున్నారు. కుక్క జ్ఞాపకాలను మరిచిపోలేని జ్ఞానప్రకాశ రావు దానికి ఏకంగా కాంస్య విగ్రహం చేయించారు. ఇటీవలే 5వ వర్ధంతి జరిగింది. కాంస్య విగ్రహానికి శాస్త్రీయబద్ధంగా పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుక్క విగ్రహానికి పూలతో అలంకరించి..పిండ ప్రధానం చేయడం విశేషం.

Read More : China President : అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో జిన్ పింగ్ అనూహ్య పర్యటన

అంతేగాకుండా..స్థానికులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. శునకరాజు ఆత్మకు శాంతి కలుగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ…ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. పెంపుడు కుక్కపై ఇంత ప్రేమనా అంటూ..మెచ్చుకుంటున్నారు.