Lakshmi Narayana : బీఆర్ఎస్‌లోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ?

ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ భేటీ అవడం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది.

Lakshmi Narayana : బీఆర్ఎస్‌లోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ?

Lakshmi Narayana : ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వేర్వేరుగా భేటీ అవడం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశాలు రాజకీయాల్లో కలకలం రేపాయి. విశాఖలో ఓ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన వివేకానంద.. అక్కడ గంటా, లక్ష్మీనారాయణతో పాటు మరికొందరు నేతలతో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ లో చేరాలని వివేకానంద వారిని ఆహ్వానించిట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని గంటా, లక్ష్మీనారాయణలు తోసిపుచ్చారు. తమ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని ఇరువర్గాలు చెప్పేశాయి. ఓ వివాహ ఫంక్షన్ లో కలిస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందను ఇంటికి ఆహ్వానించామని వారిద్దరూ చెప్పారు. తమ మధ్య రాజకీయాల ప్రస్తావనే రాలేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోనూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏపీకి చెందిన రాజకీయ నేతలను బీఆర్ఎస్ లోకి ఆహానిస్తున్నారు కేసీఆర్. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద.. విశాఖకు వెళ్లి గంటా, లక్ష్మీనారాయణలను కలవడం రాజకీయవర్గాల్లో డిస్కషన్ కు దారితీసింది.

ఉత్తరాంధ్రలో ఒక సభను బీఆర్ఎస్ నిర్వహించనుంది. ఆ సభ నిర్వహణలో వీరిద్దరూ కూడా జాయిన్ అవుతారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, దీన్ని వారిద్దరూ కూడా ఖండించడం జరిగింది. ఓ పెళ్లి వేడుకకు వివేకానంద వచ్చారని, ఆయనను తాము ఆహ్వానించామని, బ్రేక్ ఫాస్ట్ చేసే సమయంలో సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. అంతే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత అంశాలు రాలేదని గంటా శ్రీనివాసరావు తెలిపారు. వివేకాను కలిసి చాలా రోజులు అయ్యిందని, ఆయనను ఇంటికి ఆహ్వానించానని, ఈ క్రమంలోనే కలిశాము తప్ప అందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని లక్ష్మీనారాయణ కూడా చెప్పారు.

వివాహ వేడుకలో ఉత్తరాంధ్రకు చెందిన చాలామంది ఉద్యమ నేతలు, అనేక మంది మేధావి వర్గం ఎమ్మెల్యే వివేకాను కలవడం జరిగింది. ఉత్తరాంధ్రలో బీఆర్ఎస్ ఒక సభను నిర్వహించనున్నట్లు వివేకానంద వారితో చెప్పినట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో పాపులర్ అయిన నేతలను పార్టీలోకి ఆహ్వానించి, ఆ సభా వేదికగా వారంతా బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యేటట్టుగా వివేకానంద ఒక ప్రణాళిక ప్లాన్ చేసినట్లు ప్రచారం అనేది జరుగుతోంది.

కాగా, గంటా శ్రీనివసరావు కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. ఇక లక్ష్మీనారాయణ సైతం జనసేన నుంచి బయటకు వచ్చేశాక ఏ పార్టీ వైపు మొగ్గచూపలేదు. తాము విశాఖ నుంచే పోటీ చేస్తామని గంటా, లక్ష్మీనారాయణలు ప్రకటించడం జరిగింది. విశాఖ నుంచే నేను ఎంపీగా పోటీ చేస్తాను, అది ఏ పార్టీ అనేది ఇప్పుడే చెప్పలేను అని లక్ష్మీనారాయణ గతంలో అన్నారు.