Power Purchase Dues : విద్యుత్ విక్రయాల్లో ఏపీపై ఎలాంటి నిషేధం లేదు, సమాచారం లోపం వల్లే ఇలా జరిగింది

విద్యుత్ కొనుగోలు, విక్రయాల్లో ఆంధ్రప్రదేశ్ పై ఎలాంటి నిషేధం లేదన్నారు ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్. పవర్ ఎక్స్ ఛేంజ్ ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ కు ఆంధ్రప్రదేశ్ బకాయి లేదని స్పష్టం చేశారు. ఏపీ డిస్కంలు చెల్లించాల్సిన రూ.350 కోట్లు ఇప్పటికే చెల్లించామన్నారు.

Power Purchase Dues : విద్యుత్ విక్రయాల్లో ఏపీపై ఎలాంటి నిషేధం లేదు, సమాచారం లోపం వల్లే ఇలా జరిగింది

Power Purchase Dues : విద్యుత్ కొనుగోలు, విక్రయాల్లో ఆంధ్రప్రదేశ్ పై ఎలాంటి నిషేధం లేదన్నారు ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్. పవర్ ఎక్స్ ఛేంజ్ ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ కు ఆంధ్రప్రదేశ్ బకాయి లేదని స్పష్టం చేశారు.

ఏపీ డిస్కంలు చెల్లించాల్సిన రూ.350 కోట్లు ఇప్పటికే చెల్లించామన్నారు. సమాచార లోపం వల్లే విద్యుత్ విక్రయాల నిషేధిత జాబితాలో కేంద్రం ఏపీని చేర్చిందన్నారు. ఇక నిషేధంపై కేంద్రంతో మాట్లాడామని, బకాయిలపై క్లారిటీ ఇవ్వడంతో ఆ లిస్టు నుంచి ఏపీ పేరుని తొలగించారని విజయానంద్ చెప్పారు.

కాగా.. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దాదాపు 13 రాష్ట్రాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఏర్పడిందని వార్తలు వచ్చాయి. ఎందుకంటే.. విద్యుత్ ప్లాంట్లకు పేరుకుపోయిన బకాయిలు చెల్లించనందుకు విద్యుత్ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు, అమ్మకాలు నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (POSOCO) 13 రాష్ట్రాల్లోని 27 పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పవర్ ట్రేడింగ్‌ను నిషేధించాలని మూడు పవర్ ఎక్స్ఛేంజీలు అయిన ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్, పవర్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ పవర్ ఎక్స్ఛేంజ్‌లను కోరింది. ఈ పంపిణీ సంస్థలకు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి భారీ బకాయిలు ఉన్నాయి. లిస్టులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి.