Polling Starts : తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల హాంగామా మొదలైంది. ఉపఎన్నికల నిర్వహణకు రెండు రాష్ట్రాల అధికారులు రెడీ అయ్యారు. ఇటు తెలంగాణలోని నాగార్జున సాగర్‌లో అసెంబ్లీ స్థానానికి, అటు ఏపీలోని తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి మరి కాసేపట్లో పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

Polling Starts : తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్

Polling Starts

Bypoll polling starts in Andhra and Telangana :  తెలుగు  రాష్ట్రాల్లో ఉప ఎన్నికల హాంగామా మొదలైంది. ఉపఎన్నికల నిర్వహణకు రెండు రాష్ట్రాల అధికారులు రెడీ అయ్యారు. ఇటు తెలంగాణలోని నాగార్జున సాగర్‌లో అసెంబ్లీ స్థానానికి, అటు ఏపీలోని తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి మరి కాసేపట్లో పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కోవిడ్‌ వేళ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పోలింగ్‌ నిర్వహించేలా ఏర్పాట్లు జరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక సమయం ఆసన్నమైంది. ఉదయం 7గంటలకు బై పోల్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. అటు నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి, ఇటు తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఎన్నికల ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు అభ్యర్థులు, నాయకులు  చివరి నిమిషము వరకు గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు చేశారు.

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో అనివార్యమైన ఈ ఉప ఎన్నిక బరిలో 41 మంది నిలిచారు. వీరి భవితవ్యం మరికాసేపట్లో ఈవీఎంల్లో నిక్షిప్తం కానుంది. ఇటు ఎన్నిక కోసం నియోకవర్గం వ్యాప్తంగా 346 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి నలుగురు పోలింగ్‌ అధికారులు, ఇద్దరు హెల్త్‌ అధికారులను కేటాయించారు. సిబ్బందికి హ్యాండ్‌ గ్లౌజ్‌, శానిటైజర్ అందించారు.

సాగర్‌ పోలింగ్‌ విధుల్లో 3 వేల 145 మంది సిబ్బంది పాల్గొననున్నారు. 130 మంది మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌ కాస్టింగ్‌ సిబ్బంది 210, 44 మంది సెక్టార్‌ ఆఫీసర్లను నియమించారు. బందోబస్తుకు 2వేల 390 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచారు అధికారులు. పోలింగ్ ముగిసిన అనంతరం స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ గోదాముకు ఈవీఎంలను తరలించనున్నారు.

ఇటు తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల పరిధిలోని పోలింగ్‌ స్టేషన్లకు నిన్న సాయంత్రమే చేరుకున్న ఎన్నికల సిబ్బంది… ఈవీఎంలతో ఓటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో 17లక్షల మంది ఓటర్లున్నారు. మొత్తం 28మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 2 వేల 470 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. కరోనా దృష్ట్యా వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 80 ఏళ్ల పైబడిన వృద్ధులకు మొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు.

తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో పోలింగ్‌ బందోబస్తు కోసం 23 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు అధికారులు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.12 వందల 41 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్.. 37 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లను నియమించారు. ముగ్గురు కేంద్ర అబ్జర్వర్లు… 816 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ సరిహద్దుల్లో 52 చెక్‌పోస్టులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

రెండు ప్రాంతాల్లోనూ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కోవిడ్‌, ఎండల దృష్ట్యా పోలింగ్‌ సమయాన్ని పెంచింది సీఈసీ. 5 గంటల వరకు సామాన్య ఓటర్లకు అవకాశం కల్పిస్తుండగా.. చివరి గంటలో కోవిడ్‌ పేషెంట్లకు మాత్రమే ఓటు వేసేలా ఏర్పాట్లు చేసింది.

బెంగాల్‌లో మరి కాసేపట్లో ఐదో విడత ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 45 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఐదో విడత ఎన్నికలు జరగడానికి 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని ఎన్నికల సంఘం పార్టీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.