10th, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు..పూర్తి వివరాలు

  • Published By: madhu ,Published On : June 21, 2020 / 04:03 AM IST
10th, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు..పూర్తి వివరాలు

పదో తరగతి పరీక్షలు, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల విషయంలో నెలకొన్న ఉత్కంఠకు ఏపీ సర్కార్ తెరదించింది. ఎగ్జామ్స్ నిర్వహించుకుండానే..పాస్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసి..ఆ పరీక్షలకు హాజరు కావాల్సిన వారంతా ఉత్తీర్ణులైనట్లు నిర్ణయం వెలువరించింది.

దీనికి కారణం..కరోనా వైరస్ విస్తరిస్తుండడమే. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 2020, జూన్ 20వ తేదీ శనివారం ప్రకటించారు. 

మార్కులు : –
పదో తరగతి పరీక్ష విద్యార్థులకు అంతర్గత మార్కుల ఆధారంగా..గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఇస్తామని వెల్లడించారాయన. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పాస్ కావడానికి అవసరమైన మార్కులు కేటాయిస్తామని ప్రకటించారు. ఇలా మార్కులు కలిసిన వారు కంపార్ట్ మెంట్ లో ఉత్తీర్ణులైనట్లు మార్కుల జాబితాలో తెలిపారు. అయితే..అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించిన వారికి డబ్బులు రిటర్న్ చేస్తామన్నారు. 

పదో తరగతిలో ఈ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు 6,30,804 మంది, ఒకసారి ఫెయిల్ అయిన 7 వేల 800 మంది స్టూడెంట్స్ పరీక్షల విభాగం హాల్ టికెట్లు జారీ చేసింది. 2019-2020 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు ఫార్మెటివ్ పరీక్షలు, 4 సమ్మెటివ్ ఒకటి, ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించారు.

ఫార్మెటివ్ లో ఒక్కో సబ్జెక్ట్ 50 మార్కులు, సమ్మెటివ్ 100 మార్కులకు పరీక్షలు నిర్వహించారు. నాలుగు ఫార్మెటివ్ లు 200 మార్కులు, సమ్మెటివ్ 100 మార్కులు మొత్తం 300 మార్కులను 100 మార్కులకు కుదించి గ్రేడ్లు ఇస్తారా ? లేదంటే కేవలం ఫార్మెటివ్ లు 200 మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయిస్తారనే అనేది తెలియడం లేదు. 

ఇంటర్ లో ఎంతో మంది : –
ప్రథమ సంవత్సరం : 5,07,230. వృత్తి విద్య 39, 135. 
రెండో సంవత్సరం : 4,35,655. వృత్తి విద్య 26,713
వీరంతా ఇప్పుడు పాస్ అయినట్లే.

Read: తమిళనాడులో సీఎం జగన్ ఫొటోలు : నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ?