Nagarapalem SI Ravi Teja : ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్ఐ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు రేప్ కేసు నమోదు

కుంచాల రవితేజ అనే ఎస్ఐ, తాను సంవత్సర కాలం నుంచి ప్రేమించుకుంటున్నామని యువతి తెలిపారు. పెళ్లి చేసుకోవాలని అడిగితే చేసుకోనని అంటున్నారని పేర్కొన్నారు.

Nagarapalem SI Ravi Teja : ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్ఐ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు రేప్ కేసు నమోదు

Nagarapalem SI Ravi Teja

Young Woman Complaint : గుంటూరు జిల్లా నగరపాలెం ఎస్ఐ రవితేజ వివాదంలో చిక్కుకున్నారు. ఎస్ఐ రవితేజపై కేసు నమోదు అయింది. తనను ప్రేమ పేరుతో రవితేజ మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేశారు. ఆ యువతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రవితేజపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రవితేజ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవితేజ కోసం గాలిస్తున్నారు.

బాధిత యువతి మీడియాతో మాట్లాడుతూ కుంచాల రవితేజ అనే ఎస్ఐ, తాను సంవత్సర కాలం నుంచి ప్రేమించుకుంటున్నామని యువతి తెలిపారు. పెళ్లి చేసుకోవాలని అడిగితే చేసుకోనని అంటున్నారని పేర్కొన్నారు. తాను గట్టిగా అడిగి, నిలదీయడంతో వారి పేరెంట్స్ కు చెప్పి బెదిరిస్తున్నారని వాపోయారు. తాను ఎస్సీ, రవితేజ బీసీ సమాజికి వర్గానికి చెందిన వారమని వెల్లడించారు. తమ ఇద్దరికీ పెళ్లి చేయాలని కోరుకుంటున్నానని వేడుకున్నారు.

Radha Death Case: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధ హత్య కేసును చేధించిన పోలీసులు.. కట్టుకున్న వాడే కడతేర్చినట్లు నిర్ధారణ

తమ ఇంట్లో వారు పెళ్లి ఒప్పుకుంటారని, రవితేజ ఇంట్లో అడగమంటే ఆయన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని 15 రోజులుగా వాయిదా వేస్తున్నాడని చెప్పారు. తాను గుంటూరులోని ఆస్పత్రిలో పని చేస్తున్నప్పుడు రవితేజ సీఎం బందోబస్తుకు వచ్చారు. సంవత్సరం నుంచి రవితేజతో పరిచయం ఉందన్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నగరంపాలెంలోని ముళ్లపూడి ఎన్ క్లేవ్ లోని ఆయన ఫ్లాట్ కు తీసుకెళ్లాడని తెలిపారు.

నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్న రవితేజ గత 15 రోజుల నుంచి వేధిస్తున్నాడని ఆరోపించారు. లవ్ గురించి బయట బెబితే హాస్టల్ కు వచ్చి చంపేస్తానని బెదిరించారని చెబుతూ వాపోయారు. ‘నా వెనకాల పెద్ద వాళ్లున్నారు, నేను పోలీస్ డిపార్ట్ మెంట్, నీవు ఒంటరిగా ఉన్నావు, నీ ఫ్యామిలీ మొత్తం వచ్చిన ఏమీ చేయలేరు’ అని రవితేజ బెదిరించినట్లు యవతి పేర్కొన్నారు.

Lady Singham Death Case: అసలేం జరిగింది..? వెలుగులోకి సంచలన ఆడియో క్లిప్.. సీబీఐ విచారణకు అస్సాం లేడీ సింగం మృతి కేసు

ఈ విషయంపై గత పది రోజుల క్రితం యువతి స్పందన కార్యక్రమంలో ఎస్పీని కలిసి విషయాన్ని తెలిపింది. దీంతో సెటిల్ మెంట్ చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు రవితేజకు చెప్పారు. ఇద్దరికీ పది రోజుల సమయం కూడా ఇచ్చారు. అయినా రవితేజ యువతిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు.

దీంతో యువతి మహిళా సంఘాలను కలిశారు. మహిళా సంఘాలు చెప్పినా రవితేజ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో యువతి నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో రవితేజపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎస్ ఐ రవితేజపై కేసు నమోదు చేశారు.